Health Tips: మధ్యాహ్నం తిన్న వెంటనే నిద్ర వస్తుందా.. అయితే ఇలా చేయండి?

చాలామందికి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వెంటనే నిద్ర వస్తూ ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత కాసేపు అయినా

  • Written By:
  • Updated On - November 17, 2022 / 10:48 AM IST

చాలామందికి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వెంటనే నిద్ర వస్తూ ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత కాసేపు అయినా సేద తీరకపోతే కొంతమందికి హుషారు ఉండదు. కానీ ఆఫీసులలో లేదంటే ఏదైనా ఇతర పనులలో ఉన్నప్పుడు ఇలా నిద్ర రావడం అన్నది కాస్త ఇబ్బందిగా కష్టంగా కూడా ఉంటుంది. అయితే మధ్యాహ్నం తిన్న తర్వాత ఎందుకు నిద్ర వస్తుంది? అరె నిద్ర రావడానికి గల కారణాలు ఏమిటి? అలా మధ్యాహ్నం తిన్న తర్వాత నిద్రపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అన్నంలోని గ్లూకోజ్ రక్తంలో వేగంగా కలవడం వల్ల భోజనం చేసిన వెంటనే నిద్రమత్తుగా అనిపిస్తుంది. అన్నం తినడం వల్ల మెలటోనిన్, సెరటోనిన్ లాంటి ప్రశాంతతను కలగజేసే హార్మోన్ లు విడుదలవుతాయి. ఇవి ప్రశాంతతను, విశ్రాంతిని, మత్తును కలగజేస్తాయి. అందుకే మనకు భోజనం చేసిన తర్వాత వెంటనే నిద్ర వస్తూ ఉంటుంది. సాధారణంగా మనకు మధ్యాహ్న వేళలో మనలో ఉన్న శక్తి తగ్గుతుంది. దానికి అన్నం కూడా తోడైతే వెంటనే నిద్ర వస్తుంది. అందుకే ప్రోటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం మంచిది.

అలా చేయడం వల్ల డొపమైన్, ఎపినెఫ్రిన్ లాంటి చురుకైన రసాయనాలు మెదడు వేగాన్ని పెంచడమే కాదు శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. ఒకవేళ మధ్యాహ్నం సమయంలో అన్నం తినాల్సి వస్తే మామూలు బియ్యానికి బదులుగా బాస్మతి బియ్యం వాడటం మంచిది. ఎందుకంటే ఈ బాస్మతి బియ్యం లో ఉండే గ్లూకోజ్ త్వరగా రక్తంలో కలవదు. అంతేకాకుండా మధ్యాహ్నం నిద్ర వస్తుంది అనుకున్న వారు మధ్యాహ్న సమయంలో కొంచెం అన్నం తినండి.