Jaggery Face Packs: పోషక గుణాలు పుష్కలంగా ఉన్న బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని భావిస్తారు. తినడానికి కూడా రుచిగా ఉంటుంది. ఇందులో ఐరన్, పొటాషియం, జింక్, కాపర్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి, ఇవి ఆరోగ్యానికి చాలా అవసరం. అయితే బెల్లం వాడకం వల్ల అనేక చర్మ సంబంధిత సమస్యలు కూడా నయం అవుతాయని మీకు తెలుసా. ఇది ముఖంపై మచ్చలు, వృద్ధాప్య ప్రక్రియను తగ్గేలా చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కాబట్టి బెల్లంతో ఫేస్ ప్యాక్ (Jaggery Face Packs) ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
బెల్లం- నిమ్మరసం ఫేస్ ప్యాక్
ఈ ఫేస్ ప్యాక్ చేయడానికి ఒక గిన్నెలో ఒక చెంచా బెల్లం పొడిని తీసుకుని, దానికి నిమ్మరసం, చిటికెడు పసుపు కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పేస్టులా చేసి ముఖానికి పట్టించాలి. అది ఆరిన తర్వాత నీటితో కడగాలి. ఈ ఫేస్ ప్యాక్‌ని రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల ముఖంపై ఉన్న మచ్చలను తొలగించుకోవచ్చు.
We’re now on WhatsApp. Click to Join.
బెల్లం- టొమాటో ఫేస్ ప్యాక్
మీరు మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతుంటే మీరు ఈ ఫేస్ ప్యాక్‌ని ప్రయత్నించవచ్చు. దీన్ని చేయడానికి టొమాటో రసాన్ని బెల్లం పొడిలో కలపండి. తరువాత ఈ ప్యాక్‌ని ముఖానికి పట్టించి, కొద్దిసేపటి తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
Also Read: Yoga: యోగా చేయడం వల్ల ఎన్ని ఆరోగ్య లాభాలున్నాయో తెలుసా
బెల్లం- రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్
గ్లైకోలిక్ యాసిడ్ బెల్లంలో ఉంటుంది. ఇది ముఖం ముడతలు, ఫైన్ లైన్లను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ ఫేస్ ప్యాక్ చేయడానికి ఒక చెంచా బెల్లం పొడిని తీసుకుని, అందులో రోజ్ వాటర్ మిక్స్ చేసి, ఇప్పుడు ఈ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేయాలి. 15-20 నిమిషాల తర్వాత నీటితో కడగాలి. మీరు ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి రెండు సార్లు ఉపయోగించవచ్చు.
తేనె- బెల్లం ఫేస్ ప్యాక్
తేనె సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. దీని ఉపయోగం చర్మాన్ని మెరుగుపరుస్తుంది. చిన్న గిన్నెలో తేనె, బెల్లం కలిపి చిక్కని పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టించి కాసేపయ్యాక నీళ్లతో కడిగేయాలి.