Site icon HashtagU Telugu

Alia Bhatt Secret: అందాల ఆలియా భట్ హెయిర్ సీక్రెట్ ఇదే, ఆమె పర్సనల్ డైటీషియన్ సలహా ఏమిటంటే…

alia hair

alia hair

జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి . ప్రతి అమ్మాయి తన జుట్టు పొడవుగా, ఒత్తుగా, దృఢంగా ఉండాలని కోరుకుంటుంది. కానీ కొన్ని తప్పులు జుట్టును బలహీనపరుస్తాయి, వాటి గురించి తరువాత పశ్చాత్తాపపడవలసి ఉంటుంది. ఫలితంగా జుట్టు రాలడమే కాకుండా, జుట్టు మెరుపును కూడా కోల్పోతుంది.

ప్రస్తుత కాలంలో వయస్సు మళ్లిన వాళ్లకే కాదు యువత కూడా జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు ఈ సమస్య వేసవి కాలంలో మరింత తీవ్రమవుతుంది, ముఖ్యంగా మీ జుట్టు ఇప్పటికే చాలా తక్కువగా ఉన్నప్పుడు. వెంట్రుకలు రాలడం వల్ల, బట్టతలగా మారుతుందేమోనని యువకులతో పాటు యువతులు కూడా భయపడుతున్నారు.

జుట్టు రాలడం అనేది ఒక సాధారణ సమస్య, దీని కారణంగా జుట్టులో చుండ్రు, పొడిగా ఉంటుంది, ఇది ఆందోళన కలిగించే విషయం. అయితే మీరు రాలుతున్న జుట్టు సమస్యను వదిలించుకోవాలనుకుంటే, మీరు అలియా భట్ డైటీషియన్ రిజుతా దివేకర్ చెప్పిన సలహాలు పాటించాల్సిందే. జుట్టు రాలడం సమస్యను దూరం చేసే ఒక ఆయుర్వేద నూనెను ఎలా తయారు చేయాలో ఆమె తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఈ నూనెను తయారు చేయడం తన తల్లి నేర్పిందని రిజుతా దివేకర్ చెప్పారు. ఈ నూనె జుట్టును బలోపేతం చేయడంతో పాటు జుట్టు రాలే సమస్యను దూరం చేస్తుందని తెలిపారు. నూనె తయారు చేసేందుకు కరివేపాకు, ఉల్లి, మెంతి గింజలు, కలబంద, మల్లెపూలు, మందార పువ్వులు, వేప ఆకులు, కొబ్బరి నూనె అవసరం.

నూనె తయారు చేసే విధానం:
మెంతి గింజలను ఉపయోగించే ముందు ఒక రాత్రి నీటిలో నానబెట్టండి. దీని తర్వాత వేప ఆకులు, కరివేపాకు, మల్లెపూలు, మందార పువ్వులు, ఉల్లి, మెంతి గింజలు, కలబందను మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఒక పాత్రలో తీసుకుని అందులో ఒక లీటరు కొబ్బరి నూనె వేయాలి. బాగా కలిపిన తర్వాత, సుమారు 30 నుండి 40 నిమిషాలు మరగబెట్టండి. మరిగిన తరువాత, స్టౌ నుంచి తీసివేయండి. చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసి సీసాలో నింపాలి. తలపై మసాజ్ చేయడానికి ప్రతిరోజూ ఈ నూనెను ఉపయోగించండి. ఆలియా కూడా ఈ నూనె వాడుతుందని ఆమె చెప్పారు.

Exit mobile version