Ayurvedic Oil: జుట్టు రాలడం తగ్గాలంటే.. ఈ ఆయుర్వేద నూనె ఉపయోగించాల్సిందే?

ప్రస్తుత రోజుల్లో చాలా మంది జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. హెయిర్ ఫాల్, చుండ్రు, జుట్టు తెల్లబడడం, చిట్లి పో

  • Written By:
  • Updated On - March 15, 2024 / 06:56 PM IST

ప్రస్తుత రోజుల్లో చాలా మంది జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. హెయిర్ ఫాల్, చుండ్రు, జుట్టు తెల్లబడడం, చిట్లి పోవడం ఇలా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టుకు సంబంధించిన సమస్యల నుంచి బయటపడడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా చేసి విసిగిపోయి ఉంటారు. ఇక మీదట మీకు అంత శ్రమ అక్కర్లేదు. ఇప్పుడు మేము చెప్పబోయే ఈ ఒక్క పని చేస్తే చాలు.. జుట్టు రాలడం ఆగి జుట్టు ఒత్తుగా పెరగడం కాయం. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే..

అయితే మార్కెట్ లో దొరికే వాటంన్నిటి కంటే మన ఇంట్లోనే మనకు తెలిసిన వస్తువులతో తయారు చేసుకునే ఒక ఆయుర్వేద నూనె జుట్టు రాలడాన్ని నివారించి, జుట్టును ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుందట. ఆ నూనె జుట్టు రాలడాన్ని నివారించి, జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. మరి ఆ నూనెను ఎలా తయారు చేయాలి అన్న విషయానికి వస్తే.. ముందుగా దీనికి కావలసిన పదార్థాలను చూస్తే, నాలుగు కప్పుల ఆవాల నూనె, మూడు కప్పుల కడిగిన కరివేపాకు, అర కప్పు ఎండిన మందార పువ్వులు, అర కప్పు మెంతులు, అరకప్పు ఉసిరికాయ ముక్కలు తీసుకోవాలి.

ముందుగా పెద్ద పాత్రలో నూనె వేసి అందులో కరివేపాకు వేసి వేడి చేయాలి. కాస్త రంగు మారిన తరువాత ఆ నూనెలో ఉసిరి ముక్కలు, మెంతులు, ఎండిన మందార పువ్వులు వేయాలి. దీనిని బాగా మరిగించాలి. ఈ పదార్థాలలో ఉన్న సారమంతా నూనె లోకి చేరేదాకా మరిగించాలి. ఆపై స్టవ్ ఆఫ్ చేసి దీనిని 12 గంటల నుండి 24 గంటల పాటు ఉంచి ఆపై శుభ్రమైన కంటైనర్ లోకి వడకట్టుకోవాలి. ఇక ఈ నూనెను ప్రతిరోజు జుట్టుకు మర్దన చేసి, కొన్ని గంటల పాటు అలాగే ఉంచి ఆపై తేలికైన షాంపుతో జుట్టును కడుక్కోవాలి. ఈ నూనెను వారానికి కనీసం రెండుసార్లు అయినా రాస్తే జుట్టు ఊడటం తగ్గుతుంది. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. మార్కెట్లో దొరికే నూనెల కంటే ఈ నూనె మనం స్వయంగా తయారు చేసుకుంటాం కాబట్టి, జుట్టుకు కావలసిన అన్ని రకాల పోషకాలను ఇస్తుంది.