Site icon HashtagU Telugu

Tomato Soup: ఈ టమాటో సూప్ తో జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందండి.

Chicken Soup

Get Relief From Cold And Cough With This Tomato Soup.

టమాటోలలో పోషకాలు అధికం వీటిని తినడం వల్ల శరీరానికి అన్ని విధాలా మంచిది.  టమాటో సూప్‌ను (Tomato Soup) అప్పుడప్పుడు చేసుకుని తింటే ఎంతో మంచిది. వైరల్ ఫీవర్లు వస్తున్న కాలంలో టమాటో సూప్ (Tomato Soup) తాగడం చాలా ముఖ్యం. జలుబు, దగ్గు కూడా ఈ సూప్ వల్ల తగ్గుతుంది.  ఇది కేవలం పెద్దలకే కాదు, పిల్లలకు కూడా ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుంది. చేయడం కూడా చాలా సులువు. పెద్దగా కష్టపడక్కర్లేదు. ఒకసారి ప్రయత్నించి చూడండి.

కావాల్సిన పదార్థాలు

టమోటా – పావు కిలో
బిర్యానీ ఆకు – ఒకటి
అల్లం తరుగు – అరస్పూను
పచ్చిమిర్చి – ఒకటి
ఉప్పు – రుచికి సరిపడా
గరం మసాలా – అర స్పూను
వెల్లుల్లి తరుగు – అర స్పూను
జీలకర్ర – అర స్పూను
నూనె – ఒక స్పూను
కొత్తి మీర తరుగు – ఒక స్పూను

తయారీ ఇలా

  1. టమోటోలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
  2. స్టవ్ పై కళాయి పెట్టి టమోటో ముక్కలు, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మగ్గించాలి.
  3. కళాయితే మూత పెడితే టమాటోలు బాగా మగ్గుతాయి.
  4. తరువాత మూత తీసి గరం మసాలా కూడా వేయాలి.
  5. ఈ మిశ్రమాన్ని మీడియం మంట మీద 20 నిమిషాల పాటూ ఉడికించాలి.
  6. మరొక కళాయిలో అరస్పూను వేసి జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి వేయించాలి.
  7. ఆ మిశ్రమాన్ని టమాటో గుజ్జులో వేయాలి. పైన కొత్తిమీర తరుగును చల్లాలి.

ఆరోగ్యానికి..

టమోటోలలో మన శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఈ టమోటో సూప్ బ్రేక్ ఫాస్ట్ సమయంలో తిన్నా మంచిదే. ఈ సూప్‌‌ను తరచూ తినడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మంపై ఉన్న టాక్సిన్లను తొలగిస్తుంది. క్యాన్సర్ తో పోరాడే శక్తి శరీరానికి ఇస్తుంది. టోమాటోలు, మసాలా దినుసులతో రూపొందించే ఈ సూప్ గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. మధుమేహం ఉన్న వారికి ఈ సూప్ మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె జబ్బులు, మెదడు వ్యాధులు ఉన్న వారు టమోటో సూప్ తరచూ తాగితే ఎంతో మేలు. మహిళలు కచ్చితంగా ఈ సూప్ తాగాలి. ఎముకలు బలహీనంగా మారడం తగ్గుతుంది. ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. టొమాటోలో ఉండే లైకోపీన్ పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. లైకోపీన్ వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు.  ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది.

Also Read:  Millionaires: అత్యధిక మిలియనీర్లున్న టాప్-10 నగరాలివే..