Asafoetida: ఇంగువలో వీటిని కలిపి ఫేస్‌ప్యాక్ వేస్తే చాలు.. మొటిమలు, మచ్చలు మాయం అవ్వాల్సిందే?

మామూలుగా భారతీయ వంటకాలలో చాలావరకు ఇంగువను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఇంగువ కూర రుచిని పెంచడంతోపాటు ఎన్నో రకాల ప్రయోజనాలను చేకూరుస్తుం

  • Written By:
  • Publish Date - February 11, 2024 / 09:20 PM IST

మామూలుగా భారతీయ వంటకాలలో చాలావరకు ఇంగువను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఇంగువ కూర రుచిని పెంచడంతోపాటు ఎన్నో రకాల ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ ఇంగువ కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, చర్మానికి సంబంధించిన చాలా రకాల సమస్యలకు కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. దీనిని వాడడం వల్ల చాలా చర్మ సమస్యలు దూరమవుతాయి. మరి ఆ సమస్యలు ఏంటి? వాటిని ఎలా దూరం చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే ఇందుకోసం రెండు చెంచాలా ముల్తానీ మట్టిలో ఒక చెంచా తేనె, చిటికెడు ఇంగువ, చెంచా రోజ్ వాటర్ లో కలపాలి. దీనిని ప్యాక్‌లా చేసి ముఖానికి అప్లై చేయాలి.

15 నిమిషాలు అలానే ఉంచి ఆరిన తర్వాత కడిగేయాలి. దీని వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. అలాగే చాలా మందికి వయసు పెరగడం కారణంగా ముడతలు కనిపిస్తాయి. అయితే, కొంతమందికి పోషకాహార లోపం, ఒత్తిడి, స్కిన్ కేర్ లేకపోవడం వల్ల ముందుగానే వస్తాయి. అలాంటి సమస్యకి ఇంగువ చక్కగా పనిచేస్తుంది. ఇంగువతో ఫేస్‌‌ప్యాక్ వేసుకుంటే చర్మంలో ఆక్సిజన్ సరఫరా పెరిగి ప్రకాశవంతంగా మారుతుంది. ఎవరైనా కూడా తమ చర్మం కాంతివంతంగా, తాజాగా ఉండాలని కోరుకుంటారు. అలాంటి వారు ఈ ఇంగువ ఫేస్‌ప్యాక్‌ని ట్రైచేయొచ్చు. ఇంగువని సహజ గుణాలు చర్మంలోని టైరోసిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.

టైరోసిన్ కారణంగా మెలనిన్ ఉత్పత్తి పెరిగి చర్మం నల్లబడడం, వృద్ధాప్యం వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి, వీటన్నింటికి ఇంగువ ప్యాక్ చెక్ పెడుతుంది. చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో మొటిమలు కూడా ఒకటి. ఎన్ని వాడినా కొంతమందికి మొటిమలు తగ్గవు. అలాంటి సమస్యకి ఇంగువ చక్కని ఇంటి చిట్కాలా పనిచేస్తుంది. కాబట్టి, ఇంగువ ప్యాక్‌ని ట్రై చేయొచ్చు. చాలా మందికి కాలుష్యం, ఒత్తిడి కారణంగా చర్మం పొడిబారుతుంది. అలాంటి వారు ఇంగువ ఫేస్ ప్యాక్‌ని వాడొచ్చు. దీని వల్ల చర్మం హైడ్రేట్ అవుతుంది. చర్మం పొడిబారడం, డ్రైగా మారడం, పగుళ్ళు, మచ్చలు, ముడతలు వంటి లక్షణాలను ఈ ప్యాక్ దూరం చేస్తుంది.