Site icon HashtagU Telugu

Beauty Tips: ముఖంపై నల్ల మచ్చలు తొలగిపోయి కాంతి వంతంగా మారాలంటే ఇలా చేయాల్సిందే?

Mixcollage 15 Jan 2024 02 28 Pm 7116

Mixcollage 15 Jan 2024 02 28 Pm 7116

మాములుగా మనకు ఒక వయసు వచ్చిన తరవాత ముఖంపై మొటిమలు రావడం అన్నది రావడం అన్నది సహజం. కొందరు వాటిని అలాగే వదిలేస్తే ఇంకొందరు రకరకాల ఫేస్ క్రీమ్లు, బ్యూటీ ప్రోడక్ట్ లు ఉపయోగిస్తూ ఉంటారు. వాటి వల్ల కొన్ని కొన్ని సార్లు సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఈ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ముఖం మరింత అందవిహీనంగా తయారవుతుంది. మరి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖంపై నల్ల మచ్చలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముందుగా ఈ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవడానికి బంగాళదుంపలు, కాఫీ పౌడర్, నిమ్మరసం కావాలి.

మొదట ఒక బంగాళ దుంపని తీసుకొని శుభ్రంగా కడిగి పీల్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని బంగాళ దుంపని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మెత్తటి పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని కొన్ని నీళ్లు కలిపి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఇలా ఐదు నిమిషాల పాటు ఉడికించుకునేటప్పుడు మిశ్రమం గట్టి పడ్తుంటే కాసిన్ని నీళ్లు కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆప్ చేసి దీన్ని చల్లారనివ్వాలి. ఆ తర్వాత మీ మొహానికి కావాల్సినంత మిశ్రమాన్ని తీసుకొని ఒక టేబుల్ స్పూన్ కాఫీ పొడి, అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఫేస్ శుభ్రంగా కడిగి ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసుకోవాలి.

హదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఈ ప్యాక్ ట్రై చేసిన వెంటనే మీకు తేడా తెలుస్తుంది. కాఫీ పొడి వద్దనుకున్న వాల్లు బియ్యం పిండి లేదా శనగ పిండి, గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు. నిమ్మరసం బదులుగా పాలు, రోజ్ వాటర్ ను కూడా ఉపయోగించవచ్చు. ఈ ప్యాక్ ను ప్రతిరోజూ వేసుకోవడం వల్ల టామ్, నల్లని మచ్చలు తొలగిపోతాయి. మెటిమలు కూడా రాకుండా చేస్తుంది. ఒకవేళ అప్పటికే మొటిమలు ఉన్నట్లయితే చాలా వరకు తగ్గిస్తుంది. అంతే కాకుండా మీ మొహాన్ని కాంతివంతంగా చేస్తుంది. అలాగే మొహమంతా మృదువుగా, ముడతలు లేకుండా తయారవుతుంది. ఈ ఒక్క ఫేస్ ప్యాక్ ట్రై చేస్తే చాలా ముఖంపై నల్లటి మచ్చలు మాయం అవడం ఖాయం. అలాగే ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది.

Exit mobile version