Site icon HashtagU Telugu

General Knowledge: ఇది గమనించారా.. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఫ్యాన్ ఎందుకు తెలుపుతుందో మీకు తెలుసా?

Mixcollage 09 Jan 2024 05 50 Pm 5625

Mixcollage 09 Jan 2024 05 50 Pm 5625

మామూలుగా మనం తరచుగా ఫ్యాన్లను ఉపయోగిస్తూ ఉంటాం. కొందరు టేబుల్ ఫ్యాన్ లు వినియోగిస్తే మరికొందరు సీలింగ్ ఫ్యాన్ లు ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైనా కూడా మనం ఫ్యాన్ ఆఫ్ చేసినప్పుడు వెంటనే ఫ్యాన్ ఆగిపోకుండా కొద్దిసేపు అలాగే తిరిగి కొద్దిసేపటికి నిలిచిపోతుంది. మామూలుగా టీవీ వంటి కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు స్విచ్ ఆఫ్ చేయగానే వెంటనే ఆగిపోతాయి. కానీ ఫ్యాన్ మాత్రం అలాగే కొద్దిసేపు తిరిగి ఆ తర్వాత ఆగిపోతూ ఉంటుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? ఫ్యాన్ అలాగే తిరగడం వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అయితే ఫుల్ స్పీడ్ లో వేగంగా తిరిగేది ఒక్కసారిగా ఆగడం కష్టమే అనే ఆలోచన మీకు ఉండవచ్చు. కాదా దీని వెనక సైంటిఫిక్ రీసన్ కూడా ఉంది. సైన్స్ ప్రకారం ప్రతీ వస్తువూ స్థిరంగా ఉండేందుకే ప్రయత్నిస్తుంది. అప్పుడు దానిపై స్థితి శక్తి పనిచేస్తుంది. ఆ స్థితి నుంచి వస్తువు కదిలినప్పుడు.. దానిపై గతి శక్తి పనిచేస్తుంది. అందువల్ల ఆ వస్తువు గతిశక్తితో కదలడం మొదలవుతుంది. అందువల్ల ఆ వస్తువుపై కంటిన్యూగా గతి శక్తి పనిచేస్తూ ఉంటుంది. అలాంటి వస్తువును మనం ఆపినా వెంటనే ఆగదు. దానిపై గతి శక్తి ప్రభావం ఉంటుంది.

మనం ఆపినప్పుడు దానిపై స్థితి శక్తి ప్రభావం మొదలవుతూ క్రమంగా బలపడుతూ చివరకు గతి శక్తిని అది డామినేట్ చేస్తుంది. ఇదే విధంగా స్థితి శక్తి విషయంలోనూ జరుగుతుంది. ఫ్యాన్ స్విచ్ ఆన్ చెయ్యకముందు దానిపై స్థితి శక్తి పనిచేస్తూ ఉంటుంది. స్విచ్ ఆన్ చెయ్యగానే క్రమంగా గతి శక్తి ప్రభావం పెరుగుతూ స్థితి శక్తిని డామినేట్ చేస్తుంది. అందువల్లే ఫ్యాన్ ఒక్కసారిగా స్పీడ్‌గా తిరగకుండా క్రమంగా స్పీడ్ పెంచుకుంటుంది. వస్తువు ఎంత వేగంతో కదులుతోంది అనే దాన్ని బట్టీ గతి శక్తి ప్రభావం కూడా ఆధారపడి ఉంటుంది. ఇది ఫ్యాన్ మాత్రమే కాదు. విమానం, సైకిల్, కారు, స్కూటర్, రైలు ఇలా కదిలే అన్నింటికీ వర్తిస్తుంది. కదిలే వస్తువులను సడెన్‌గా ఆపడం కష్టం. ఒకవేళ సడెన్‌గా ఆపితే, దాని వల్ల గతి శక్తి, స్థితి శక్తి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఆ వస్తువు బరువు, వేగాన్ని బట్టీ ఆ యుద్ధ తీవ్రత ఉంటుంది.