Fruit Custard: సమ్మర్ స్పెషల్.. ఫ్రూట్ కస్టర్డ్ఎంతో టేస్టీగా తయారు చేసుకోండిలా?

సమ్మర్ వచ్చింది అంటే చాలు ఎక్కువ శాతం మంది కూల్ డ్రింక్స్,ఫ్రూట్ సలాడ్, ఫ్రూట్ మిక్సర్ లాంటివి తాగాలి తినాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఎక్కువ

  • Written By:
  • Publish Date - April 2, 2024 / 10:04 PM IST

సమ్మర్ వచ్చింది అంటే చాలు ఎక్కువ శాతం మంది కూల్ డ్రింక్స్,ఫ్రూట్ సలాడ్, ఫ్రూట్ మిక్సర్ లాంటివి తాగాలి తినాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఎక్కువ శాతం మంది సమ్మర్లో ఇష్టపడే రెసిపీ ఫ్రూట్ కస్టర్డ్. చాలామంది ఇది ఇంట్లో ఎలా చేసుకోవాలో తెలియక బయటకు వెళ్లి వందలకు వందలు పోగేస్తూ ఉంటారు. మరి ఇంట్లోనే టేస్ట్ గా దీనిని ఎలా తయారు చేసుకోవాలో అందుకు ఏమేం కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కావాల్సిన పదార్ధాలు:

పాలు – ఒక లీటర్
వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ – నాలుగు స్పూన్స్
పంచదార – అర కప్పు
మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ – పావు టీ స్పూన్
అరటిపండు – ఒకటి
ఆపిల్ – ఒకటి
సపోటా – ఒకటి
కివీ – ఒకటి
ఖర్జూరం – 7
జీడిపప్పు – 50 గ్రా
నల్ల ద్రాక్ష – 50 గ్రా
గ్రీన్ ద్రాక్ష – 50 గ్రా
ఖర్భూజ ముక్కలు – అర కప్పు
దానిమ్మ గింజలు – అర కప్పు

తయారీ విధానం:

పావు లీటర్ పాలల్లో కస్టర్డ్ పౌడర్, ఎసెన్స్ వేసి గడ్డలు లేకుండా కలుపుకోవాలి. పాలని ఒక పొంగు రానిచ్చి అందులో పంచదార, ఇంకా కస్టర్డ్ మిల్క్ వేసి గడ్డలు లేకుండా చిక్కబడేవరకు కలపాలి. తర్వాత ఫ్రిజ్లో 2 గంటలు ఉంచాలి. 2 గంటల తరువాత కస్టర్డ్ గట్టిగా మీగడ పెరుగులా అవుతుంది, అప్పడు మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే కస్టర్డ్ క్రీమీగా అవుతుంది. ఫ్రిజ్లో గంట ముందే ఫ్రూట్స్ ని ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఒక గ్లాస్ లో కస్టర్డ్ పోసి దాని మీద ఫ్రూట్స్ కొద్దిగా ఒక లేయర్ గా వేసి దాని మీద కస్టర్డ్ పోసుకోవాలి. కస్టర్డ్ మీద మళ్ళీ ఒక లేయర్ గా ఫ్రూట్స్ వేసుకుంటూ ఇలా గ్లాస్ జార్ నింపాలి. నింపిన జార్ని మళ్ళీ ఒక గంట ఫ్రిజ్లో ఉంచి తింటే చాలా బాగుంటుంది, లేదా వెంటనే కూడా తినవచ్చు.

Follow us