Weight Loss to Constipation: వెయిట్ లాస్ నుంచి మలబద్దకం దాకా అన్నీ పోతాయ్.. ఈ 3 జ్యూస్ లు తాగండి!!

ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే ప్రతిరోజూ కూరగాయలు, పండ్ల రసాలను తప్పకుండా తాగాలి.

Published By: HashtagU Telugu Desk
Carrot Juice Imresizer

Carrot Juice Imresizer

ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే ప్రతిరోజూ కూరగాయలు, పండ్ల రసాలను తప్పకుండా తాగాలి. ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలంటే వేయించిన ఆహారాలను తినకూడదు. అలాగే ఉప్పు, చక్కెర వాడకాన్ని తగ్గించాలి. అయితే కొన్ని రకాల జ్యూస్ లను తాగితే మీరు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా లైఫ్ ను లీడ్ చేస్తాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

* తులసి జ్యూస్

తులసి జ్యూస్ క్రమం తప్పకుండా తాగితే.. మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదని నిపుణులు చెబుతున్నారు. తులసి జ్యూస్
దగ్గు, జలుబు, ఆస్తమా, సైనస్, బ్రాంకైటిస్, ఎసిడిటీ, జ్వరం వంటి వివిధ రుగ్మతలకు  తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అందుకే దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం మర్చిపోకూడదు.  ఆకుపచ్చ తులసి కంటే నల్ల తులసి ఆకుల్లోనే ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. దగ్గు, జలుబు సమస్యలు ఉంటే నల్ల తులసి ఆకు రసంలో, అల్లం రసం కలిపి తాగితే దీని నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు.

* పుచ్చకాయ జ్యూస్

పుచ్చకాయ జ్యూస్ లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. దీనిలో ఉండే వాటర్ కంటెంట్ శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి బయటపడేస్తుంది. అలాగే కడుపును చల్లగా ఉంచుతుంది. వడదెబ్బ నుంచి రక్షిస్తుంది. అలాగే అధిక రక్తపోటును కూడా నియంత్రించడానికి సహాయపడుతుంది.  డీహైడ్రేషన్ సమస్య ఉంటే ఉప్పు, పంచదార, మైదా పిండిని తీసుకోవడం తగ్గించాలి. ఎందుకంటే ఈ ఆహారాలు శరీరంలో నీటి శాతాన్ని తగ్గిస్తాయి.  వీటికి బదులుగా పుచ్చకాయ రసాన్ని తాగితే.. మీ శరీరం హైడ్రేట్ గా ఉంటుంది.

* క్యారెట్ జ్యూస్

క్యారెట్ జ్యూస్ లో క్యాల్షియం, విటమిన్ ఎ, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ,  విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. క్యారెట్ జ్యూస్ ను  ఉదయం పరిగడుపున తీసుకుంటే ఎంతో మంచిది.  క్యారెట్ జ్యూస్ తో మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి. క్యారెట్ జ్యూస్ కళ్లను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి.  చర్మం, జుట్టు, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే ఆకలిని పెంచడానికి కూడా సహాయపడుతుంది.

  Last Updated: 25 Sep 2022, 11:20 PM IST