Site icon HashtagU Telugu

5 Star Hotel: ఇక‌పై టాయిలెట్ వ‌స్తే.. 5 స్టార్ హోట‌ల్‌కు అయినా వెళ్లొచ్చు!

5 Star Hotel

5 Star Hotel

5 Star Hotel: షాపింగ్‌లు, ప్రయాణాలు లేదా ఇతర అవసరాల కోసం పట్టణాలకు వెళ్లినప్పుడు చాలామంది ప్రజలు ముఖ్యంగా మహిళలు, అత్యవసర సమయాల్లో టాయిలెట్స్ దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అయితే దేశంలో అత్యంత ఖరీదైన ఫైవ్ స్టార్ హోటల్స్‌లో (5 Star Hotel) సహా ఏ హోటల్‌కు అయినా వెళ్లి ఉచితంగా టాయిలెట్‌ను ఉపయోగించుకునే చట్టపరమైన హక్కు పౌరులకు ఉందనే విషయం చాలామందికి తెలియదు. ఈ చట్టం బ్రిటీష్ కాలం నాటి ‘స‌రాయిస్ చట్టం, 1867 (Sarais Act, 1867)’ లోని సెక్షన్ 7(2) కింద ఉంది. ఈ పురాతన చట్టం ఇప్పటికీ అమలులో ఉంది.

ఫైవ్ స్టార్ హోటల్స్‌లోనూ అనుమతి!

సాధారణ ప్రజల సౌకర్యం కోసం రూపొందించబడిన ఈ చట్టం ప్రకారం దేశంలో స‌రాయ్‌గా (ప్రయాణికులు ఆశ్రయం పొందే ప్రదేశంగా) రిజిస్టర్ అయిన ఏ హోటల్‌కు అయినా (ఫైవ్ స్టార్ హోటల్స్‌తో సహా) ప్రజలు వెళ్లి టాయిలెట్ సదుపాయాలను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా ప్రజలు అక్కడ తాగే నీటిని (Drinking Water) అడిగి తీసుకునే హక్కు కూడా ఉంది. స‌రాయిస్ చట్టం 1867 లోని సెక్షన్ 7(2) లో ఉన్న ‘ఉచిత యాక్సెస్’ (Free Access) అనే పదాన్ని ఇక్కడ ఉచిత టాయిలెట్ వినియోగం, తాగునీరు అందించడానికి విస్తృతంగా అర్థం చేసుకోవడం జరుగుతోంది. ఈ చట్టం ఉద్దేశం ప్రయాణంలో ఉన్నవారి ప్రాథమిక అవసరాలను తీర్చడం.

Also Read: Man Sticks QR Code: పెళ్లిలో క్యూఆర్ కోడ్ ద్వారా చ‌దివింపులు!

ప్రజల సౌకర్యార్థం తీసుకువచ్చిన హక్కు

పట్టణాల్లో ఖరీదైన రెస్టారెంట్లు లేదా ఫైవ్ స్టార్ హోటల్స్ వద్ద సాధారణ ప్రజలు టాయిలెట్ కోసం అడగడానికి సంకోచిస్తుంటారు. తమను అనుమతించరేమో అనే భయంతో వెనుకాడుతారు. కానీ ఈ చట్టం గురించి తెలిస్తే ఇకపై ఎటువంటి మొహమాటం లేకుండా లేదా నిరాకరణకు భయపడకుండా ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.

కొన్ని సందర్బాల్లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ వంటి సంస్థలు సైతం ఈ చట్టాన్ని అమలు చేస్తూ తమ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు ప్రజలకు ఉచిత తాగునీరు, టాయిలెట్ సదుపాయాలను అందించాలని ఆదేశించాయి. ప్రజలందరూ తమ ఈ చట్టపరమైన హక్కు గురించి తెలుసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో టాయిలెట్స్ లేదా మంచి నీరు అవసరమైనప్పుడు హోటల్ సిబ్బంది అనుమతి నిరాకరిస్తే వారికి ఈ 1867 నాటి చట్టాన్ని గుర్తు చేయవచ్చు. పౌరుల సౌకర్యం కోసం ఉన్న ఈ హక్కును అవసరమైనప్పుడు తప్పక ఉపయోగించుకోవాలి.

Exit mobile version