Site icon HashtagU Telugu

Beauty Tips: పొడి చర్మం పొడిబారిన జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇలా చేయాల్సిందే!

Mixcollage 07 Mar 2024 05 17 Pm 1191

Mixcollage 07 Mar 2024 05 17 Pm 1191

మామలుగా చాలామందికి సీజన్ తో సంబంధం లేకుండా పొడి చర్మం, పొడి జుట్టుతో బాధపడుతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ఈ సమస్య విపరీతంగా ఎక్కువగా ఉంటుంది. చర్మం పొడిబారే సమస్య నుంచి ఉపశమనం పొందడం కోసం నూనెలు, మాయిశ్చరైజింగ్ క్రీములు రాసినప్పటికీ ఎలాంటి ఫలితం ఉండదు. ఒక్క చర్మం మాత్రమే కాదు పెదవుల విషయంలో కూడా పెదవులు పొడిబారి పగిలిపోయి ఇబ్బందిని కలిగిస్తాయి. అయితే చలికాలంలో ఈ సమస్య నుండి ఉపశమనం పొందడం కోసం నాలుగు రకాల నూనెలు బాగా పనిచేస్తాయి.

అయితే చర్మంపై పైపూత గానే కాకుండా, నాభిలో కూడా నాలుగు రకాల నూనెలు వేసుకుంటే దాని ఫలితం చర్మం పైన కనిపిస్తుంది. చలికాలంలో పెదవుల పగుళ్లు వచ్చిన వారు పెదవులపై పగుళ్లు తగ్గకపోతే ప్రతిరోజు నాభిపై ఆవాల నూనె రాసుకోవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. పెదవుల పగుళ్ల కోసం ప్రతిరోజు నిద్ర వేళకు ముందు నాభిలో స్వచ్ఛమైన ఆవాల నూనెను రాసుకోవాలి. ఇది పెదవుల పగుళ్లను కొద్దిరోజుల్లోనే తగ్గిస్తుంది. ఇక విపరీతంగా మడమలు పగిలి ఇబ్బంది పడుతున్న వారు కొబ్బరి నూనెను పగిలిన మడమల మీద రాయాలి. అంతేకాదు ప్రతిరోజు పడుకునే ముందు కొద్దిగా కొబ్బరి నూనెను నాభిలో వేసుకోవడం వల్ల మడమల పగుళ్ల నుండి ఉపశమనం వస్తుంది.

ఇక పొడి చర్మంతో ఇబ్బంది పడుతున్న వారు, చర్మం సాఫ్ట్ గా మారేందుకు నువ్వుల నూనెను రాయాలి.
ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు నువ్వుల నూనెను నాభిపై రాస్తే పొడి చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు జుట్టు పొడిబారే సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇక కంటి చూపు మెరుగుపడాలంటే రాత్రి పడుకునే ముందు నాభిలో ఆలివ్ ఆయిల్ రాసుకోవాలి. ఇలా చేస్తే కంటి చూపు మెరుగు పడుతుంది. ఇక చర్మం పొడిబారే సమస్యలను తగ్గించడానికి, చర్మం స్మూత్ గా ఉండడానికి నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆవాల నూనె, ఆలివ్ ఆయిల్ లను బొడ్డులో వేసుకుంటే కొద్దిరోజుల్లోనే మంచి ఫలితం వస్తుందని చెప్తున్నారు. మరి ఇంకెందుకాలస్యం మన శరీరంలోని అనేక అవయవాలను, శరీర భాగాలను ఆరోగ్యంగా ఉంచే ఈ ఆయిల్స్ ను ట్రై చెయ్యండి.