Weight Loss : బరువు తగ్గాలా? ఆయనకు నమస్కారం చేస్తే చాలు..!

బరువు తగ్గడానికి యోగా (Yoga) అనేది సురక్షితమైన, సమర్థవంతమైన మార్గం. రక్త ప్రసరణను మెరుగుపరచడానికి,

బరువు తగ్గడానికి (Weight Loss) యోగా అనేది సురక్షితమైన, సమర్థవంతమైన మార్గం. రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, హృదయ స్పందన రేటును అవసరమైన మేరకు పెంచడానికి యోగా ఎంతో ఉపయోగపడుతుంది. యోగాను రోజుకు రెండుసార్లు ప్రాక్టీస్ చేయొచ్చు. ఉదయం వేళ, సాయంత్రం తరువాత యోగాను ప్రాక్టీసు చేయడం ది బెస్ట్. ఇక బరువు తగ్గడానికి (Weight Loss).. మీరు సూర్య నమస్కారం, చంద్ర నమస్కారం వంటి ఆసనాలతో పాటు కపాల్‌ భతి వంటి ప్రాణాయామ వ్యాయామాలను చేయొచ్చు.

సూర్య నమస్కారం

సూర్యుడికి నమస్కారం చేయడాన్ని సూర్య నమస్కారం అంటారు. సూర్యుడు శక్తి స్వరూపుడు, శక్తికి చిహ్నం. సూర్య నమస్కారం మొదట కుడి కాలుతో ప్రారంభమవుతుంది. ఇది సూర్య నాడి దిశగా సమాంతరంగా కుడి వైపునకు కొనసాగుతుంది. కుడి, ఎడమ వైపుల కోసం మొత్తం 8 యోగా ఆసనాలు12 స్టెప్స్ గా డివైడ్ చేయబడ్డాయి. ఈక్రమంలోనూ మీ దృష్టిని మీ శ్వాసపైకి మళ్లించడం ప్రయోజనకరంగా ఉంటుంది.

సూర్య నమస్కారానికి రైట్ టైం..?

సూర్య నమస్కారం చేయడానికి ఉదయం సూర్యోదయానికి ముందు టైం చాలా మంచిది. తద్వారా మీ శరీరం మీ నియంత్రణలో ఉంటుంది. మీ మనస్సు తేలిక అవుతుంది. మీ శక్తులు సమతుల్యంగా ఉంటాయి. మీకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సూర్య నమస్కారం అనేది బుద్ధి శక్తిని పెంచడానికి ఒక శక్తివంతమైన పద్ధతి. స్థిరమైన యోగా అభ్యాసం ఫలితంగా.. మీరు ప్రతి పనిని గొప్ప శ్రద్ధతో , స్పృహతో చేయొచ్చు.

సూర్య నమస్కారం స్టెప్స్ ఇవీ..

ఆసనం 1: ప్రాణాసనం (ప్రార్థనా భంగిమ)

ఆసనం 2: హస్త ఉతానాసనం (ఎత్తిన చేతుల భంగిమ)

ఆసనం 3: పాద హస్తాసనం (ముందుకు వంగడం)

ఆసనం 4: అశ్వ సంచలనాసన (గుర్రపుస్వారీ భంగిమ)

ఆసనం 5: సంతోలనాసనం (ప్లాంక్ పోజ్)

ఆసనం 6: అష్టాంగ నమస్కార ఆసనం (ఎనిమిది అవయవాల నమస్కారం)

ఆసనం 7: భుజంగాసనం (కోబ్రా భంగిమ)

ఆసనం 8: అధో ముఖ స్వనాసన (క్రిందికి చూస్తున్న కుక్క భంగిమ)

ఆసనం 9: అశ్వ సంచలనాసన (అశ్వాసన భంగిమ)

ఆసనం 10: పాదహస్తాసనం (ముందుకు వంగడం)

ఆసనం 11: హస్త ఉతానాసనం (ఎత్తిన చేయి భంగిమ)

ఆసనం 12: ప్రాణాసనం (ప్రార్థన భంగిమ)

సూర్య నమస్కారం ప్రయోజనాలు:

☀️ ఇది ఆధ్యాత్మికను పెంచడంతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తుంది.

☀️ పూర్తి స్థాయి శరీర వ్యాయామంగానూ పనిచేస్తుంది.

☀️ దీనివల్ల మొత్తం నాడీ వ్యవస్థకు మేల్కొలుపు లభించి యాక్టివేట్ అవుతుంది. ఫలితంగా శారీరక బలం, శక్తి అభివృద్ధి చెందుతాయి.

☀️ ఇది విమర్శనాత్మకంగా, హేతుబద్ధంగా ఆలోచించే మీ సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

☀️ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

☀️ శరీరం యొక్క రెండు వైపుల మధ్య సమతుల్యతను ప్రోత్సహిస్తుంది.

☀️ సూర్య నమస్కారం శరీరం, మనస్సు, ఆత్మపై చాలా సానుకూల ప్రభావాలను కలిగి ఉంటుంది.

☀️ మీరు దీన్ని రోజూ నిర్వహించినప్పుడు అభివృద్ధి చెందడానికి మరియు ఎదగడానికి మీకు సహాయపడుతుంది. సూర్య నమస్కారం యొక్క 108 చక్రాలని శుభసంఖ్యగా పరిగణిస్తారు.

☀️ ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన రెండు నుంచి మూడు వారాల వ్యవధిలోనే మీ బాడీ లాంగ్వేజ్ లో చేంజ్ అనేది కనిపించడం మొదలవుతుంది.

Also Read:  Clock Vastu Tips : ఇంట్లో ఏ దిక్కున గడియారం ఉండాలి?