Site icon HashtagU Telugu

Pomegranate For Skin: పెరుగులో దానిమ్మ రసాన్ని కలిపి ఫేస్‌ ప్యాక్‌ వేస్తే చాలు.. కలిగే లాభాలు ఎన్నో?

Mixcollage 02 Mar 2024 08 06 Am 5391

Mixcollage 02 Mar 2024 08 06 Am 5391

దానిమ్మ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తరచూ చేసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు పొందవచ్చు. అయితే దానిమ్మ కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది అన్న విషయం మనలో చాలామందికి తెలియదు. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, అవసరమైన విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా చర్మ స్థితిస్థాపకతను పునరుద్ధరించే సామర్థ్యం కూడా దీనికి ఉంటుంది.

మరి ముఖ్యంగా దానిమ్మ రసాన్ని పెరుగులో కలిపి తీసుకోవడం వల్ల మరిన్ని మంచి ఫలితాలను చూడవచ్చు. ఒక గిన్నెలో పెరుగు తీసుకుని, దానికి దానిమ్మ రసం జోడించాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేయాలి. అంతే కాకుండా దానిమ్మ రసాన్ని పాలతో కలిపి తీసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని లోపలి నుంచి మెరిసేలా చేస్తుంది. అలాగే ఓట్స్‌లో దానిమ్మ రసాన్ని కలిపి తీసుకుంటే కూడా ఫలితం ఉంటుంది. దీని కోసం ఓట్ పౌడర్ ను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో దానిమ్మ రసాన్ని కలిపి చర్మానికి పట్టించాలి. నిమ్మకాయతో కలపడం వల్ల కూడా చర్మానికి పని చేస్తుంది.

ఒక గిన్నెలో సమానంగా దానిమ్మ రసం, నిమ్మరసం కలుపుకోవాలి. ఇది టాన్ సమస్యను దూరం చేస్తుంది. అంతే కాకుండా కలబంద, దానిమ్మ రసాన్ని కలిపి రాసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మ సంరక్షణలో కలబందకు ప్రత్యామ్నాయం మరొకటి ఉండదు. ఒక గిన్నెలో కలబంద సారం తీసుకుని, దానికి దానిమ్మ రసం కలపాలి. ఆ ప్యాక్‌ని ముఖానికి బాగా పట్టించాలి. 20 నిమిషాలు అలాగే ఉంచి శుభ్రమైన నీటితో కడిగేస్తే సరి.