Restful Sleep: ప్రశాంతమైన నిద్రకు 5 చిట్కాలు!!

అయితే రోజూ కొన్ని టిప్స్​ పాటించండి.. హాయిగా నిద్ర పోవచ్చు. ఆరోగ్యంగా జీవించవచ్చు.

  • Written By:
  • Publish Date - September 27, 2022 / 07:30 AM IST

ప్రశాంతంగా నిద్ర పట్టడం లేదా?
హాయిగా నిద్రపోలేక పోతున్నారా?
అయితే రోజూ కొన్ని టిప్స్​ పాటించండి.. హాయిగా నిద్ర పోవచ్చు. ఆరోగ్యంగా జీవించవచ్చు.

* తినగానే నిద్రపోవద్దు

అన్నం తినగానే మీరు నిద్రపోవద్దు. నిద్రపోవడానికి కనీసం 2 నుంచి 3 గంటల ముందు అన్నము తినేలా ప్లాన్ చేసుకోండి. దీనివల్ల అన్నం బాగా జీర్ణం అవుతుంది. నిద్రపోయే ముందు నీళ్లు తాగండి. ఇలా చేయడం వల్ల మీకు చక్కగా నిద్ర పడుతుంది.

* నిద్రకు ముందు స్నానం

నిద్రపోయే ముందు స్నానం చేయడం మంచిది. చన్నీళ్లు లేదా గోరు వెచ్చటి నీళ్ల తో స్నానం చేయండి. రాత్రి స్నానం చేశాక ఈజీగా నిద్రపడుతుంది. స్నానం వల్ల శరీరం మురికి వదలడంతో పాటు ఒళ్ళు తేలిక అవుతుంది. అలసట పోతుంది.

* నిద్రపోయే ముందు దీపం వెలిగించండి

నిద్రపోయే ముందు మీరు బెడ్ రూమ్ లో ఒక దీపం వెలిగించండి. దీనివల్ల మనసుకు మంచి ఫీలింగ్ కలుగుతుంది. నిద్రకు ముందు యోగాభ్యాసం చేయడం కూడా మంచి అలవాటే. ప్రశాంతమైన నిద్రకు ఇదొక మార్గం.

* మంచం .. మృత్యు శయ్య

నిద్రపోయే ముందు బెడ్ పై కూర్చొని ఒకసారి ఆలోచించుకోండి. అది బెడ్ మాత్రమే కాదు.. మీ మృత్యుశయ్య కూడా. గత 24 గంటల్లో మీరు చేసిన పనులన్నీ మంచివే అయితే వాటిని గుర్తుకు తెచ్చుకోండి. ఒకవేళ అవన్నీ మంచివే అయితే మీ జీవితం సార్ధకం. మీరు ఇక ప్రశాంతంగా నిద్రకు ఉపక్రమించండి. ఈ ఫీలింగ్, ఆత్మవిమర్శ మీకు మంచి నిద్రపట్టేలా చేస్తుంది.

* ఒంటరిగా నిద్రపోండి

లైటింగ్, ఉష్ణోగ్రత, సౌండ్ వల్ల చాలామందికి నిద్రపోయే టైంలో డిస్టర్బెన్స్ అవుతుంటుంది. కొందరికి చల్లటి వాతావరణం.. ఇంకొందరికి వెచ్చటి వాతావరణం ఇష్టం . కాబట్టి అందరూ ఒకే గదిలో సరిగ్గా అడ్జస్ట్ కావడం కష్టం . బాగా నిద్ర పోవడం, ప్రశాంతంగా నిద్రపోవడం అనేది ఒంటరిగా ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది.