Site icon HashtagU Telugu

Weight Loss Tips: మీరు బరువు తగ్గాలా? అయితే ఈ టైంలో ఆహారం తీసుకోండి చాలు!

Weight loss

Weight loss

బరువు తగ్గాలని భావించే చాలామంది వైట్ రైస్ అన్నం తినడం మానేస్తారు.. దానికి బదులు సలాడ్, చపాతీలు తినడం మొదలు పెడతారు. వాస్తవానికి అకస్మాత్తుగా ఇలా చేయడం మంచిది కానే కాదు. బరువు తగ్గడానికి రైస్ తినడం మానేయాల్సిన అవసరం లేనే లేదని.. బ్యాలెన్స్ డ్ డైట్ తీసుకుంటే సరిపోతుందని సైన్స్ చెబుతోంది.బ్యాలెన్స్ డ్ డైట్ అంటే.. కార్బో హైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్లు, ఫైబర్ అన్ని సరైన మోతాదులో ఉండేది. మనం బరువు తగ్గేందుకు ఏం తింటున్నాం? అనే దానితో పాటు ఎప్పుడు తింటున్నాం? అనేది కూడా ముఖ్యమని తాజా అధ్యయనంలో గుర్తించారు. ఆ రీసెర్చ్ రిపోర్ట్ తెలియాలంటే ఈ వార్త మొత్తం చదవాల్సిందే.

వెయిట్ లాస్ కోసం ఎప్పుడు అన్నం తినాలి?

మనకు బాగా ఆకలి అయినప్పుడు మాత్రమే అన్నం తింటే.. బరువు తగ్గడంలో చాలా ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. రోజూ సమయానికి అన్నం తినే వారి కంటే.. ఆకలి అయినప్పుడు అన్నం తినే వారిలో బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్నం తక్కువ తినే వాళ్ళ కన్నా.. ఆకలి అయినప్పుడే కడుపు నిండా తినే వాళ్ళకు వెయిట్ లాస్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది.

ఏమిటీ అధ్యయనం?

అమెరికా శాస్త్రవేత్తలు నిర్వహించిన ఈ అధ్యయనంలో వివిధ వయసులకు చెందిన 6000 మందిని స్టడీ చేశారు. వారిని ఒక్కరొక్కరుగా ఇంటర్వ్యూ చేసి .. ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకున్నారు. వాళ్ళ బరువు వివరాలను కూడా నమోదు చేశారు. ఈటింగ్ స్టైల్స్ మూడు రకాలు.. ఆకలి వేసినప్పుడే తినడం, ఎమోషనల్ గా మారి తినడం, స్ట్రిక్ట్ నిబంధన పెట్టుకొని తక్కువగా తినడం. ఈ మూడ్ స్టైల్స్ ఎంత మందికి ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేశారు.

3 ఈటింగ్ స్టైల్స్..

అధిక బరువు గురించి బాగా ఆలోచిస్తూ, దిగులుతో.. ఆహార పదార్థాలు తీసుకుంటే దాన్ని ఎమోషనల్ ఈటింగ్ అంటారు. కేలరీలను లెక్క పెట్టుకుంటూ ఆహారం తింటే దాన్ని స్ట్రిక్ట్ ఈటింగ్ అంటారు. ఈ రెండు ఈటింగ్ స్టైల్స్ కలిగిన వాళ్ళ తో పోలిస్తే.. ఆకలి అయినప్పుడే ఆహారం తీసుకునే వారు వెయిట్ లాస్ లో ఎక్కువ పురోగతి సాధించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.ఇలాంటి వారి శారీరక, మానసిక ఆరోగ్య స్థాయి కూడా భేష్ గా ఉందని వెల్లడైంది.

ప్రముఖ సైంటిస్ట్ ఏమన్నారు?

అమెరికా కు చెందిన ప్రముఖ సైంటిస్ట్, రట్ గర్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చార్లెస్ మార్క్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “ఆకలిని చంపుకుంటే.. ఆహారం తీసుకోకుండా పస్తులు ఉంటే బరువు తగ్గదు. అలా చేయడం వల్ల ఆరోగ్యానికి మరింత ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఆకలి అయినప్పుడు ఆహారం తీసుకుంటేనే హెల్త్ కు మంచిది’ అని ఆయన స్పష్టం చేశారు. ఈమేరకు వివరాలతో కూడిన అధ్యయన నివేదిక “బ్రిటీష్ జర్నల్ ఆఫ్ హెల్త్ సైకాలజీ” లో ప్రచురితం అయింది.