Food Rules : 60 ఏళ్ల దాకా ఒక లెక్క.. 60 ఏళ్ల తర్వాత మరో లెక్క.. !! 60 ఏళ్లకు పైబడిన వారు ఆహార అలవాట్లను మార్చుకోవాలి. షుగర్, బీపీ వంటి సమస్యలను తీవ్రతరం చేసే ఫుడ్స్‌కు(Food Rules) దూరంగా ఉండాలి. ఇంతకీ అరవై ఏళ్లకు పైబడిన వారు ఏమేం తినాలి ? ఏమేం తినకూడదు ? ఈ కథనంలో తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
60 ఏళ్లకు పైబడినవారు తినాల్సినవి
60 ఏళ్లకు పైబడినవారు తినాల్సిన ఐటమ్స్‌లో ఆకు కూరలు, కూరగాయలు, దుంపలు, గింజ ధాన్యాలు, మాంసకృత్తులు, ఐరన్, కాల్షియం ఉండే ఆహారం ఉన్నాయి. బీ కాంప్లెక్స్, విటమిన్ డీ ఉండే పండ్లు, పాలు, పాల పదార్థాలు, పీచు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు, ముడి బియ్యం, దంపుడు బియ్యం, రాగులు, చేపలు తినొచ్చు. కొంతమంది ముసలివారు విటమిన్ సప్లిమెంట్లు ఎడాపెడా వాడేస్తుంటారు. కానీ అలా చేయకూడదు. వాటిని వాడే ముందు డాక్టర్ల సలహా తీసుకోవడం మంచిది.
60 ఏళ్లకు పైబడినవారు తినకూడనివి..
60 ఏళ్లకు పైబడినవారు తినకూడని ఐటమ్స్‌లో ఉప్పు, చక్కెర, స్వీట్లు, డీప్ ఫ్రై చేసిన వంటకాలు, ఫాస్ట్‌ఫుడ్ ఉన్నాయి. కర్రీపాయింట్లలో తయారు చేసే కూరలు తినకూడదు. నెయ్యి, పొద్దుతిరుగుడు నూనె తినకుండా ఉంటే బెటర్. అరవై ఏళ్లు దాటిన వారు ఏది తిన్నా.. రుచిగా అనిపించడం లేదని అంటున్నారు. నాలుకపై ఉండే రుచిమొగ్గలు తగ్గిపోవడం వల్ల అలా అనిపిస్తుంది. రుచి మొగ్గలు సరిగ్గా రుచిని గ్రహించకపోవడం వల్ల చప్పిడిగా ఫీలవుతారు. 60 ఏళ్లు దాటిన వారికి ఎక్కువగా ఆకలి కాదు. అందుకే వారు రోజులో సాధ్యమైనన్ని ఎక్కువసార్లు అన్నం తినాలి. దీనివల్ల శరీర జీవక్రియలకు తగినంత శక్తి లభిస్తుంది.
Also Read :Sravana Masam 2024: శ్రావణమాసంలో సోమ, మంగళ శుక్ర వారాలలో చేయాల్సినవి,చేయకూడని పనులు ఇవే?
గమనిక: పైన ఇచ్చిన సమాచారాన్ని పాఠకుల అవగాహన కోసం ఇంటర్నెట్ నుంచి తీసుకున్నాం. దీన్ని ‘హ్యాష్ ట్యాగ్ యూ తెలుగు’ ధృవీకరించదు.