Healthy Bones : ఎముకలను బలంగా ఉంచే ఆహార పదార్థాలు ఇవే…!!

ప్రస్తుత కాలంలో పోషకాహార లోపం సాధారణం అయ్యింది. ముఖ్యంగా కాల్షియం లోపించినప్పుడు ఎముకలు బలహీనపడతాయి. మానవ శరీరం సాఫీగా పనిచేయాలంటే ఎముకలు ఆరోగ్యంగా ఉండాలి.

  • Written By:
  • Publish Date - June 23, 2022 / 07:15 AM IST

ప్రస్తుత కాలంలో పోషకాహార లోపం సాధారణం అయ్యింది. ముఖ్యంగా కాల్షియం లోపించినప్పుడు ఎముకలు బలహీనపడతాయి. మానవ శరీరం సాఫీగా పనిచేయాలంటే ఎముకలు ఆరోగ్యంగా ఉండాలి. విటమిన్ సప్లిమెంట్లు తీసుకుంటే కొద్దిగా ఉపశమనం లభించినా…సరైన ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని పొందుతాం. ఎముకలు బలంగా ఉండాలంటే మనం తీసుకోవల్సిన ఆహార పదార్థాలేవో ఓ సారి చెక్ చేద్దాం.

రాగులు, నువ్వులు, బీన్స్…
ఈ మూడింటిలోనూ కాల్షియం అత్యధిక స్థాయిలో ఉంటుందని పోషకనిపుణులు చెబుతున్నారు. నువ్వులు మార్కెట్లో దొరుకుతాయి. వీటిలో ఎముకలను గట్టిపరిచే కాల్షియం, ఫాస్పరస్ ఉన్నాయి.

బీన్స్ లో ఎముకల పటుత్వానికి సహకరించే ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇందులో కాల్షియంతోపాటు మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ధాతువులు కూడా ఉన్నాయి. ఆహారంలో బీన్స్ ను ఎక్కువగా తీసుకుంటే పోషకాల లోపాన్ని అధిగమించవచ్చు. ఇక రాగుల్లోనూ కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. రాగి పిండితో తయారు చేసే జావ, రొట్టెలు, బూరెలు తీసుకుంటే కాల్షియం లోపాన్ని కొంతమేర భర్తీ చేసుకోవచ్చు.

ఫైనాపిల్, పాలకూర, అరటి, నట్స్, బొప్పాయి….
వీటిలోనూ ఎముకల బలానికి ఉపయోగపడే పోషకాలు ఉన్నాయి. పైనాఫిల్ లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. పైనాపిల్ తీసుకోవడం వల్ల శరీరంలో ఆమ్ల స్థితిని సమతుల్యం చేసుకుని..కాల్షియం నష్టపోకుండా చేస్తుంది.

బాదం, వేరుశనగ, జీడి….
వీటిలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ నిల్వలు అధికంగా ఉన్నాయి. మెగ్నీషియం, ఎముకలు కాల్షియంను గ్రహించేందుకు తోడ్పడుతుంది. ఇక అరటిపండులోనూ మెగ్నీషియం అద్బుతమైన వనరు. ఎముకల నిర్మాణంలో మెగ్నీషియం ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందుకే ప్రతిరోజూ ఒక అరటిపండు తింటే ఎముకలు పుష్టిగా ఉంటాయని చెబుతుంటారు.

ఇక బొప్పాయిలోనూ కాల్షియం ఉంటుందట. వంద గ్రాముల బొప్పాయిలో 20మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుందట. రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే కాల్షియం మెగ్నీషియం లోపాన్ని అధిగమించి ఎముకల బలంగా ఆరోగ్యంగా తయారవుతాయి.