Eye Care: కళ్ళు సరిగ్గా కనిపించడం లేదా.. అయితే ఈ ఉప్పును వాడాల్సిందే.?

టెక్నాలజీ రోజు రోజుకి డెవలప్ అవ్వడంతో యువత గంటల తరబడి లాప్ ట్యాప్ లు, మొబైల్ ఫోన్ ల ముందు గడుపుతున్నారు. కేవలం యువత మాత్రమే కాకుండా

  • Written By:
  • Publish Date - September 24, 2022 / 09:30 AM IST

టెక్నాలజీ రోజు రోజుకి డెవలప్ అవ్వడంతో యువత గంటల తరబడి లాప్ ట్యాప్ లు, మొబైల్ ఫోన్ ల ముందు గడుపుతున్నారు. కేవలం యువత మాత్రమే కాకుండా చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ మొబైల్ ఫోన్ కు అడిక్ట్ అయిపోయి గంటల తరబడి ఫోన్లను ఉపయోగిస్తూ కంటి చూపును కోల్పోతున్నారు. దీంతో అతి చిన్న వయసులోనే కళ్లద్దాలు వచ్చేస్తున్నాయి. క్రమంగా ఈ సమస్య పెరిగి పెద్దదై ఒక ఏజ్ వచ్చేసరికి ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. డిజిటల్‌ స్క్రీన్స్‌ ఎక్కువగా వాడటం కారణంగా బ్లర్డ్‌ విజన్‌, కంటిలో మచ్చలు, కళ్లు అదరడం,కంట్లో నీళ్లు, కంటి నొప్పు వంటి సమస్యలు అధికం అవుతున్నాయి.
అంతే కాకుండా మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ నైట్ ఎక్కువ సేపు మేలుకోవడంతో సరిపడినంత నిద్ర లేకపోవడం, థైరాయిడ్, ఉప్పు అధికంగా ఉన్న ఆహారపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, మొదలైన కారణాల వల్ల కూడా కళ్ల చుట్టూ వాపు, కళ్ల కింద నల్లటి వలయాలు, కళ్లు అలసిపోయినట్లుగా అనిపించడం లాంటి సమస్యలు వస్తుంటాయి. అయితే మనకు చూపు అన్నది చాలా ముఖ్యం. కాబట్టి కంటిని ఆరోగ్యంగా చూసుకోవాలి. కాబట్టి క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకుంటూ జాగ్రత్తగా పాటించడం వల్ల కళ్లద్దాలు రాకుండా చూసుకోవచ్చు.
కళ్ళను రక్షించుకోవడం కోసం కొన్ని రకాల చిట్కాలను పాటించాలి అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.. కంటి చూపుకి త్రిఫల ఔషధంగా పనిచేస్తుంది. త్రిఫల అంటే ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ ఈ మూడు కలిపి చేసిన చూర్ణం మనకి మార్కెట్‌లో దొరుకుతుంది. ఈ చూర్ణానికి యాంటీ ఏజింగ్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఉంటాయి. మీకు కంటి సమస్యలు ఉంటే రాత్రిపూట త్రిఫల చూర్ణాన్ని నెయ్యి, తేనెతో సమాన పరిమాణంలో కలిపి తీసుకోవడం మంచిది. అలాగే కంటి చూపు ఆరోగ్యంగా ఉండాలి అంటే రాక్‌ సాల్ట్‌ ఎంతో మంచిది. రాక్ సాల్ట్ కంటి చూపు ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఈ రాక్ సాల్ట్ నీ  వంటల్లో ఉపయోగించడం వల్ల కంటి సమస్యలు దూరం అవుతాయట.