Site icon HashtagU Telugu

Alcohol and Health: మద్యం సేవించిన తర్వాత నోటి దుర్వాసన రాకూడదంటే ఈ టిప్స్‌ని పాటించండి?

Alcohol And Heart Health

Alcohol

మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసి కూడా మద్యాన్ని సేవిస్తూనే ఉంటారు. అయితే ఈ మద్యం సేవించే వాళ్ళు కూడా రెండు రకాలుగా ఉంటారు. అందులో మొదటి వారు ఎప్పుడో పార్టీలకు పబ్బులకు ఫ్రెండ్స్ లో కలిసినప్పుడు మాత్రమే తాగుతూ ఉంటారు. ఇక రెండవ రకం ప్రతిరోజు చుక్క లేనిదే నిద్రపోరు. అయితే ఇలా మద్యానికి బానిసగా మారిన వారు ఇంట్లో వాళ్లకు తెలిసినా కూడా భయపడకుండా అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు.

కానీ అప్పుడప్పుడు తాగేవారు ఇప్పుడైనా ఒకసారి ప్యాక్ చేసి స్మెల్ వస్తుందా అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా తాగిన తర్వాత స్మెల్ రాకుండా ఉండడానికి అనేక రకాల చాక్లెట్లు హ్యాపీడేంట్లు ఇలాంటివి వాడుతూ ఉంటారు. అయితే మద్యం సేవించిన తర్వాత నోటి దుర్వాసన రాకుండా ఉండాలి అంటే ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మద్యం సేవించిన తర్వాత ఒక స్ట్రాంగ్ బ్లాక్ కాఫీ తాగడం వల్ల నోటి నుంచి వచ్చే ఆల్కహాల్ వాసనను దూరం చేసుకోవచ్చు. కాఫీ వాసన బలంగా ఉంటుంది కాబట్టి మద్యం వాసన రాదు.

అలాగే మద్యం సేవించిన తర్వాత మౌత్ వాష్ తో పుక్కలించడం చక్కటి పరిష్కారం అని చెప్పవచ్చు. ఇలా చేయడం వల్ల నోరు ఫ్రెష్ అవ్వడమే కాకుండా నోటిలో ఉండే బ్యాక్టీరియాని కూడా చంపుతుంది. అలాగే వెల్లుల్లి ఉల్లిపాయలతో కూడా నోటి వాసనను తొలగించవచ్చు. డైరెక్ట్ గా తినడానికి ఇష్టపడిన వారు సలాడ్ రూపంలో కలిపి ఉల్లిపాయలను తినవచ్చు. వెల్లుల్లి నమలడం వల్ల ఆల్కహాల్ వాసన వెంటనే తగ్గిపోతుంది. అయితే కొన్ని కొన్ని సార్లు ఈ వెల్లుల్లి వాసన ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అటువంటప్పుడు మౌత్ వాష్ ఉపయోగించడం మేలు.