Work Stress: పని ఒత్తిడి వల్ల సతమతం అవుతున్నారా.. ఇలా రిలాక్స్ అవ్వండి!

ప్రస్తుతం పరిస్థితుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి ఒత్తిడి అనేది ఉంటుంది. ఒత్తిడి లేని మనిషి ఉండడు. కానీ ఆ ఒత్తిడి ఎక్కువ అవుతే రోగాలు వస్తాయని..

  • Written By:
  • Publish Date - August 8, 2022 / 10:11 PM IST

ప్రస్తుతం పరిస్థితుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి ఒత్తిడి అనేది ఉంటుంది. ఒత్తిడి లేని మనిషి ఉండడు. కానీ ఆ ఒత్తిడి ఎక్కువ అవుతే రోగాలు వస్తాయని.. ఒత్తిడి తగ్గించుకోవాలని వైద్యులు చెప్తూనే ఉంటారు. ఇక అలాంటి ఒత్తిడి తగ్గాలంటే ఇక్కడ చెప్పే కొన్ని చిట్కాలను పాటించండి.. ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు..

వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇంటి నుంచే పని. ఇక ఆ ల్యాప్ టాప్ ల ముందు ఉదయం కూర్చుంటే సాయింత్రం వరకు ఒకటే పని. కనీసం లేవడానికి సమయం ఉండదు.. లేవాలి అని అనిపించదు కూడా. కానీ.. నిరంతరం కూర్చుని పని చెయ్యడం వల్ల ఒత్తిడి ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అందుకే గంటకి ఒకసారైనా అలా ఐదు నిమిషాలు నడవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

ఉదయం ఒకసారి.. సాయింత్రం ఒకసారి కాఫీ లేదా గ్రీన్ టీ తాగిన ఒత్తిడి నుంచి రిలాక్స్ అవుతారు. పది నిమిషాలు నడిచిన ఒత్తిడి తగ్గి పనిపైన శ్రద్ద పెట్టొచ్చు. అలసటగా నీరసంగా అనిపిస్తే కూర్చొని పని చేసే చోటే ధ్యానం చేసిన మంచి ఫలితం ఉంటుంది. ఇవి మాత్రమే కాదు కాసేపు మనసుకు నచ్చిన మ్యూజిక్ విన్న, స్నేహితులతో కాసేపు ఫోన్ మాట్లాడిన ఒత్తిడి నుంచి విముక్తులయ్యి ప్రశాంతంగా ఉంటారు.