Thyroid Diet: థైరాయిడ్ అనేది ఒక గ్రంధి. ఇది శరీరం ఎదుగుదలకు ఎంతో సహాయ పడటంతో పాటు జీవక్రియలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ థైరాయిడ్ సీతాకోకచిలుక ఆకారంలో ఉండి మెడ ముందు భాగంలో ఉంటుంది. అయితే ఈ థైరాయిడ్ గ్రంధిలో ఎటువంటి మార్పులు ఆనంద వరకు ఎటువంటి సమస్యలు ఉండవు కానీ ఒకవేళ ఈ థైరాయిడ్ గ్రంధి పనితీరులో ఎటువంటి మార్పులు వచ్చినా వెంటనే శరీరంలో అనేక రకాల మార్పులు చోటుచేసుకుంటాయి. మరి ముఖ్యంగా ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు అలసట సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇందులో భాగంగానే హైపర్ థైరాయిడిజం ఉన్నవారికి రాత్రిపూట సరిగ్గా నిద్ర పెట్టకపోవడం వల్ల రోజంతా కూడా అలసిపోయినట్టుగా కనిపిస్తారు. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు రోజు వారి ఆహారంలో కొన్ని రకాల ఆహార పదార్థాలను చేర్చుకుంటే థైరాయిడ్ గ్రంధిలో ఎటువంటి మార్పులు రావు. మరి థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గుడ్డును తినడం వల్ల అయోడిన్ ఖనిజాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. అలాగే ఇది ప్రాథమిక థైరాయిడ్ హార్మోన్ అయిన థైరాక్సిన్ ఏర్పడటంలో కీలక పాత్ర పోషిస్తుంది.
అదేవిధంగా ఉసిరి కూడా థైరాయిడ్ సమస్య ఉన్నవారికి ఎంతో బాగా పనిచేస్తుంది. నారింజ పండు కంటే ఉసిరిలో రెండు రెట్లు విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అలాగే గుమ్మడి గింజల్లో జింక్ ఎక్కువ మొత్తం ఉండి, చేయడంలో ఉండే ఇతర విటమిన్ లు ఖనిజాల శోషణకు సహాయపడతాయి. ఈ గుమ్మడి గింజల్లో ఉండే జింక్ శరీరంలో థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి, నియంత్రణకు సహాయపడుతుంది. అలాగే థైరాయిడ్ ఆరోగ్యకరంగా పనిచేయడం కోసం సహాయపడే పోషకాలు అన్నీ కూడా చియా విత్తనాలలో ఉంటాయి. ఈ చియా విత్తనాలలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాల పుష్కలంగా ఉండి శరీరంలో చమటను తగ్గించడానికి ఉపయోగపడతాయి.