Shining Teeth Tips: దంతాలు పసుపు రంగులో ఉన్నాయా.. అయితే ఈ వంటింటి చిట్కాలు మీకోసమే?

చాలామందికి దంతాల వరుస బాగుండి తెల్లగా మిలమిల మెరిసిపోతూ ఉంటాయి. ఇంకొందరికి మాత్రం గార పట్టి పసుపు కలర్ లో ఉంటాయి. అలాంటివారు నలుగురిలో మాట్లాడాలి అన్న నవ్వాలి అన్న కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - October 5, 2022 / 08:45 AM IST

చాలామందికి దంతాల వరుస బాగుండి తెల్లగా మిలమిల మెరిసిపోతూ ఉంటాయి. ఇంకొందరికి మాత్రం గార పట్టి పసుపు కలర్ లో ఉంటాయి. అలాంటివారు నలుగురిలో మాట్లాడాలి అన్న నవ్వాలి అన్న కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే దంతాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి అని చెబుతూ ఉంటారు. అయితే దంతాలను పసుపు రంగులో నుంచి తెలుపు రంగులోకి మారాలి అంటే ఎటువంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దంతాలు పసుపు రంగులోకీ మారడానికి గల కారణాల విషయానికొస్తే..

ప్రతి రోజు టీ, కాఫీ, వైన్,సోడా వంటి పానీయాలు తీసుకోవడం, దంతాలను శుభ్రం చేసుకోకపోవడం,నోటి ద్వారా శ్వాస బ్లూబెర్రీస్, చెర్రీస్, దుంపలు లేదా దానిమ్మ వంటి కొన్ని ఆహారాలు,చక్కెర పానీయాలు,దూమపానం, పాన్ మసాలా, పొగాకు మొదలైన కారణాల వల్ల దంతాల పసుపు రంగులోకి మారుతాయి. పసుపు రంగు దంతాలను తెలుపు రంగులోకి మారడానికి ఇటువంటి చిట్కాలను పాటించాలి అన్న విషయానికి వస్తే..బేకింగ్ సోడా.. దంతాలు తెల్లబడటానికి బేకింగ్ సోడా బాగా ఉపయోగపడుతుంది.

బేకింగ్ సోడాను, పటికపొడిని సమానంగా తీసుకొని కలిపి బ్రష్ చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల పళ్లపై ఉన్న గార పోతుంది. అలాగే వేప పుల్లను చాలామంది ఉదయాన్నే బ్రష్ గా వాడుతూ ఉంటారు. వేపలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. వేపలో ఉండే యాంటీ ఇంప్లమెంటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, పసుపు రంగును తొలగించడంలో బాగా పనిచేస్తాయి. అదేవిధంగా అరటిపండు, నిమ్మకాయ, నారింజ తొక్కలు దంతాలకు అప్లై చేయడం వల్ల తెల్లగా మెరవడంతో పాటు బలంగా కూడా తయారు అవుతాయి. కొబ్బరి దంతాలను తెల్లగా చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనె లో లారీక్ ఆసిడ్ ఉండి మంటను తగ్గించి బ్యాక్టీరియాని చంపుతుంది. అలాగే వెళ్ళిన తులసి ఆకులను ఆవాలన్నతో కలిపి ఆ మిశ్రమాన్ని దంతాలపై రాయడం వల్ల పల్లపై ఉన్న పసుపు రంగు పోతుంది..