Site icon HashtagU Telugu

Dandruff: చుండ్రు సమస్య ఇబ్బంది పెడుతోందా.. అయితే సింపుల్ గా ఇలా చేయండి!

Dandruff

Dandruff

జుట్టుకు సంబంధించిన సమస్యలలో చుండ్రు సమస్య అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. ఈ చుండ్రు సమస్య కారణంగా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు ఈ చుండ్రు సమస్య అన్నది భరించలేని విధంగా ఉంటుంది. తలపై నుంచి ఒక తెల్లటి పదార్థం కింద పడుతూ ఉండడంతో పాటు తల మొత్తం దురదగా మంటగా అనిపిస్తూ ఉంటుంది. దాని కారణంగా కొన్ని సార్లు హెయిర్ ఫాల్ కూడా అవుతూ ఉంటుంది. చుండ్రును తగ్గించుకోవడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ ఆయిల్ షాంపూలు వంటి వినియోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ చుండ్రు సమస్య తగ్గక ఇబ్బంది పడుతుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలో ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వేప ఆకులను నీటిలో వేసి మరిగించి ఈ నీటితో జుట్టు కడుక్కోవడం వల్ల చుండ్రు తగ్గుతుందట. అలాగే పెరుగులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది చుండ్రును తగ్గిస్తుంది. పెరుగును పేస్ట్ లాగా జుట్టు మీద అప్లై చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. అలాగే కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుందట. కలబందలోని యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చుండ్రు ట్రీట్మెంట్ లో సహాయపడతాయి. మీరు నూనె, నిమ్మరసం కలపి కలబందను జుట్టుకి పట్టించవచ్చు.

బేకింగ్ సోడా బేకింగ్ సోడాను జుట్టుకు అప్లై చేయడం వల్ల చుండ్రు నుండి విముక్తి పొందవచ్చట. మెంతి గింజల పేస్ట్‌ని జుట్టుకు అప్లై చేయడం వల్ల కూడా చుండ్రు సమస్య తగ్గుతుందట. మెంతి గింజలను నూనెలో వేసి చల్లార్చుకొని ఆ తర్వాత వాటిని మిక్సీలో వేసి పేస్ట్ లా చేసి తలకు పట్టించవచ్చట. అయితే పైన చెప్పిన చిట్కాలను తరచుగా వినియోగించడం వల్ల చుండ్రు సమస్యను తగ్గించు కోవచ్చు అని చెబుతున్నారు.