Weight loss : పొట్ట వేలాడుతుంటే సిగ్గు పడుతున్నారా, అయితే ఈ డైట్ చార్ట్ మీకోసం..!!

నేటికాలం మహిళలకు..ఉద్యోగం, పిల్లలు, ఇల్లు...ఇవి చూసుకోవడానికి వారికి సమయం పోతుంది.

  • Written By:
  • Publish Date - September 10, 2022 / 07:00 PM IST

నేటికాలం మహిళలకు..ఉద్యోగం, పిల్లలు, ఇల్లు…ఇవి చూసుకోవడానికి వారికి సమయం పోతుంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు నిత్యం ఏదొక పనిలో నిమగ్నమవుతుంటారు. కొన్నిసందర్భాల్లో వాళ్ల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ తీసుకోరు. రోజంతా పనులతో అలసిపోయే గృహిణికి వ్యాయామం చేయడానికి సమయమే దొరకదు. దీని కారణంగా శరీరంలోని మిగిలిన భాగాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. కొవ్వు పొట్టలోనే కాకుండా, చేతులు, కాళ్లు, నడుము భాగాల్లో కూడా కనిపిస్తుంది. అయితే క్రమంగా పెరుగుతున్న బరువును ఎలా తగ్గించుకోవాలో అర్థం కాదు. కాబట్టి చిన్న చిన్న మార్పులు చేస్తే మీ ఆరోగ్యంలో పెద్ద మార్పును కలిగిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

సరైన ఆహారం:
సరైన ఆహారం తీసుకుంటే మీ బరువును కంట్రోల్ చేస్తుంది. బరువు తగ్గాలంటే ఆహారాన్ని తగ్గిచండం కాదు..మీరు తినే ప్లేటులో కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫైబర్, అవసరమైన కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ సరైన సమతుల్యతను కలిగి ఉండటం చాలా ముఖ్యం. మీరు ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు శరీరానికి హానికలిగించే ఆహారాన్ని ఎలా మార్చుకోవచ్చో తెలుసుకుందాం.

ఉదయం 6-7 గంటల మధ్య దోసకాయ డిటాక్స్ వాటర్ తీసుకోవాలి:
దోసకాయ డిటాక్స్ నీళ్లతో ఉదయాన్ని ప్రారంభించండి. దోసకాయ నీరు మీ చర్మాన్ని లోపల, బయట నుంచి క్లీన్ చేస్తుంది. రోజంతా మిమ్మల్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపిస్తుంది.

ఉదయం 8.30గంటలకు అల్పాహారం :
ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో గోధుమ చీలా లేదా దోసేతో సాంబార్ తినండి. లేదంటే లౌకీ కా చీలా లేదా వెజ్ స్టఫింగ్ తో శాండ్ విచ్ తినండి.

11.30 మిడ్ మార్నింగ్ స్ప్రౌంట్ సలాడ్:
బ్రేక్ ఫాస్ట్ చేసిన గంట తర్వాత గ్రీన్ టీ తీసుకోవాలి. మధ్యాహ్నం అరకప్పు స్ప్రౌట్స్ సలాడ్ తీసుకోవాలి.ఇదే కాకుండా వందగ్రాముల స్కిమ్డ్ చీజ్ తీసుకోవాలి.

మధ్యాహ్నం 1గంటలకు రాగీఇడ్లీ, సాంబర్..:
మధ్యాహ్నం ఒంటిగంటకు రాగి ఇడ్లీ, అరకప్పు సాంబార్ తీసుకోవాలి. ఇది కాకుండా రెండు రోటీలు, మిక్స్డ్ వెజ్ టేబుల్స్ , పప్పుతో తయారు చేసిన కూరను తీసుకోవాలి. రాగిలో అద్భుతమైన ఫైబర్ ఉంటుంది కాబట్టి కడుపు నిండుగా ఉంచడంలో సహాయపడుతుంది.

మధ్యాహ్నం 2 గంటలకు :
భోజనం చేసిన తర్వాత కాసేపు వాకింగ్ చేయడం మర్చిపోవద్దు. తిన్న వెంటనే కూర్చుకోకూడదు. 10-15నిమిషాలు నడవాలి. ఇప్పుడు మరోసారి గ్రీన్ టీ తాగాలి.

సాయంత్రం 4 గంటలకు :
సాయంత్రం స్నాక్స్ సమయంలో పండు లేదా సలాడ్ తోపాటు అరకప్పు మజ్జిగ తాగాలి. ఇవే కాకుండా ప్రతిరోజూ 1 ఆపిల్ కూడా తినాలి.

సాయంత్రం 7 గంటలకు :
పొద్దుపోయాక తినడం కాకుండా సమాయానికి రాత్రి భోజనం చేయడం అలవాటు చేసుకోండి. మీరు తినే ఆహారం చాలా తేలికగా ఉండాలి. వెజిటెబుల్ బ్రౌన్ రైస్ తో సలాడ్ తీసుకోవాలి. దీనికి కిచ్జీ కూడా తినవచ్చు.

రాత్రి భోజనం పూర్తి చేసిన తర్వాత రెండు గంటల తర్వాత పాలలో పసుపు కలుపుకుని తాగండి. లేదంటే గ్రీన్ టీ కానీ మసాలా టీ కానీ తీసుకోండి. ఇవన్నీ కాకుండా ప్రతిరోజూ 1 గంటపాటు వ్యాయామం చేస్తే బరువు సులభంగా తగ్గిపోతారు.