Vastu & Positive Energy: వాస్తు ప్రకారం ఈ వస్తువులు మీ ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి.. లేకుంటే కష్టమే!

వాస్తు అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ. అందుకే ఇంటి విషయంలో వాస్తు అనేది చాలా ముఖ్యం.

  • Written By:
  • Publish Date - August 29, 2022 / 07:30 AM IST

వాస్తు అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ. అందుకే ఇంటి విషయంలో వాస్తు అనేది చాలా ముఖ్యం. ఏ గది ఎక్కడ ఉండాలి ద్వారాలు ఎటువైపు ఉండాలి అనేది వాస్తులో చాలా ముఖ్యమైనది. అందుకే చాలామంది ఇంటిని నిర్మించేటప్పుడు వాస్తు చూసుకుంటారు. అంతేకాకుండా ఇంట్లో మరింత ఎనర్జీ పెరగటానికి వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు కూడా ఉంటాయి. వాటి వల్ల పాజిటివ్ ఎనర్జీ కాకుండా సంతోషాన్ని కూడా నింపుతాయి. ఇంతకు ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం.

కళ: ఇంట్లో కొన్ని కళాకృతులు, చిత్రాలు, చిహ్నాలను ఉండటం వాస్తు ప్రకారం మంచిది. వాటి వల్ల 90% వరకు మన ప్రవర్తన, నిర్ణయాలను ప్రభావితం చేస్తుందట.

బుద్ధుడు: బుద్ధుడు ఆశీర్వదిస్తున్నట్లు విగ్రహం లేదా ఫోటో ఉండాలి. బొటనవేలు నుండి ఐదు వేళ్లు వాస్తుశిల్పం యొక్క ఐదు అంశాలుగా పరిగణించబడతాయి. దీనివల్ల ధైర్యం, రక్షణ కలుగుతుంది.

గుర్రాలు: గుర్రాల ఫోటోలు ఉండటం వల్ల పట్టుదల, సాధన, విధేయత, విజయం, బలం, స్వాతంత్ర్యం, వేగం వాటికీ చిహ్నంగా ఉంటుంది. భవిష్యత్ ను ముందుకి అద్భుతంగా సాగిస్తుంది.

ప్రసిద్ధ ఫీనిక్స్: ఫీనిక్స్ పక్షి అన్ని నాగరికతలో కనిపిస్తుంది.మనదేశంలో దీనిని గరుడ అని పిలుస్తారు. ఇది జీవితంలో కొత్త అవకాశాన్ని ఇస్తుంది. అంతేకాకుండా మరింత ప్రాచుర్యం పొందవచ్చు.

నీటి చిత్రాలు: నీటి చిత్రాన్ని ఉంచడం వల్ల సానుకూల శక్తి ప్రవహించకుండా నిరోధించవచ్చు. దానిని ఆపవచ్చు కూడా. జీవితంలో కదలిక, ప్రవాహాన్ని తెలియజేయడంకు ఇవి బాగా సహాయపడతాయి.

చిత్రకళ: బెడ్‌రూమ్‌లో చిత్రకళలాంటివి వేలాడుతుండటం వల్ల ప్రేమ, శక్తి ఆకర్షిస్తుంది. జంట నవ్వగల అందమైన కళ లేదా నృత్య కళ జంట మధ్య సామర్థ్యాన్ని కలిగిస్తుంది.