Site icon HashtagU Telugu

Tips : పాత పాత్రలు కొత్తగా మెరవాలంటే…ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..!!

cocking oil

cocking oil

మన వంటింట్లో రకరకాల పాత్రలను వాడుతుంటాం. ముఖ్యంగా అన్నం, కర్రీ చేసేందుకు పాత్రలను ఉపయోగిస్తుంటాం. వాటికి ఆయిల్ అంటుకుని జిడ్డుగా మారుతుంటాయి. ఇంకా కొన్ని పాత్రలు మురికిగా మారాయని పక్కన పడేస్తుంటాం. అయితే మురికిగా మారిన పాత్రలను కొత్తగా తళతళ మెరిసేలా చేయోచ్చు. ఎలాగో ఈ చిట్కాలను ఫాలో అవ్వండి.

– మీ ఇంట్లో ఉంచి లూబ్రికేటింగ్ పాత్ర పాడైపోయిందా. దానిని పక్కన పడేశారా. ఒక చిన్న చిట్కాతో దాన్ని మెరిసేలా చేయవచ్చు. ఎలాగంటే…ఒక గుడ్డలో వెనిగర్ తీసుకుని దానితో పాత్రపై రుద్దండి. పది నిమిషాలపాటు రుద్దినట్లయితే కొత్తగా మెరుస్తుంది.

-ప్రెషర్ కుక్కర్ ను ఎక్కువగా వాడుతుంటాం. అది పాతగా మారినట్లయితే…కుక్కర్ లో కొన్ని నీళ్లు పోసి 1 టీస్పూన్ వాషింగ్ పౌడర్, సగం నిమ్మకాయను వేసి బాగా మరిగించాలి. తర్వాత డిష్ క్లినింగ్ స్క్రబ్బర్ తో శుభ్రం చేస్తే మరకలన్నీ మాయం అవుతాయి.

-కొన్ని పాత్రల్లో అడుగు బాగానా…నల్లగా మారుతుంది. దానిని శుభ్రం చేసేందుకు వెనిగర్, నిమ్మరసం వేసి మరిగించాలి.
-అల్యూమినియం పాత్రలు త్వరగా పాడైతాయి. ఈ పాత్రలను పాలిష్ చేయడం కూడా కష్టంగా మారుతుంది. అలాంటి పాత్రలను పక్కన పారేస్తాం. డిష్ వాషింగ్ పౌడర్ లో కొద్దిగా ఉప్పు కలిపి పాత్రలను శుభ్రం చేసి చూడండి.

ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే…దీన్ని షేర్ చేస్తూ హ్యాష్ ట్యాగ్ యూ తెలుగు ద్వారా మరిన్ని కథనాలను చదవడానికి కనెక్ట్ అవ్వండి.