House Maintenance: మీ ఇంట్లోని గాలిని శుభ్రపరుచుకోండిలా..

చాలా సార్లు ఇంట్లోని గాలి అదోరకంగా వాసన వస్తుంటుంది. ఎప్పటికప్పుడు ఇంటిని క్లీన్ చేసిన అలానే అనిపిస్తుంది.

చాలా సార్లు ఇంట్లోని గాలి అదోరకంగా వాసన వస్తుంటుంది. ఎప్పటికప్పుడు ఇంటిని క్లీన్ చేసిన అలానే అనిపిస్తుంది. అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇంట్లో చక్కని గాలి ఉంటుంది? ఇందుకోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వేటికి దూరంగా ఉండాలి? ఎలాంటి మార్పులు చేయాలి? వీటి వల్ల ఏం ఉపయోగం? ఏమేం వాడితే ఇంట్లోని గాలి శుభ్రమవుతుంది? ఇందుకోసం ఏమేం టిప్స్ పాటించాలో ఇప్పుడు చూద్దాం:

వెంటిలేషన్‌ పెంచడం:

ఇంటి వెంటిలేషన్‌ని పెంచడం వల్ల ఇంట్లోకి మంచి గాలి వస్తుంది. కిటికీలు, తలుపులు ఎప్పుడు కూడా మూసి వేయకుండా వాటిని తెరిచి ఉంచాలి. ఇలా చేయడంవల్ల ఇంట్లో పాత వాసనలన్నీ పోయి ఇంట్లోకి ఫ్రెష్ గాలి వస్తుంది. చక్కగా ఉంటుంది.

షూ స్టాండ్‌ని బయటపెట్టడం:

చాలా మంది ఇంటి లోపల షూ స్టాండ్ లేదా చెప్పులని పెడుతుంటారు. దీని వల్ల 50% కంటే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కాబట్టి ఇంట్లో కాకుండా బయటే షూ స్టాండ్ లేదా చెప్పులని పెట్టడం మంచిది.

సాల్ట్ క్రిస్టల్ ల్యాంప్:

సాల్ట్ క్రిస్టల్స్ అనేవి గాలిని ప్యూరిఫై చేయడంలో హెల్ప్ చేస్తాయి. కాబట్టి సాల్ట్ క్రిస్టల్ ల్యాంప్ ని ఇంట్లో పెట్టడం వల్ల గాలి ప్యూరిఫై అవుతుంది.

యాక్టివేటెడ్ చార్‌కోల్:

యాక్టివేటెడ్ చార్‌కోల్ కూడా ఇంటికి ఓ ఫ్రెష్‌నెస్‌ని ఇస్తుంది. దీని వల్ల ఇంట్లోని గాలిలో దుర్గంధం పోతుంది. కాబట్టి వీటిని ఉంచడం మంచిది.

ఇండోర్ ప్లాంట్స్:

ప్లాంట్స్ కూడా ఇంట్లోని గాలిని ప్యూరిఫై చేస్తాయి. లిల్లీ, అలోవేరా గాలిలోని చెడు బ్యాక్టీరియాని దూరం చేసి ఆక్సీజన్ అందిస్తాయి.

ఎసెన్షియల్ ఆయిల్స్:

ఎసెన్షియల్ ఆయిల్స్ అంటే పెప్పర్ మింట్ ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్ లాంటివి. ఇవి మంచి ప్లజెంట్ స్మెల్ ని ఇస్తాయి. వీటిని వాడడం వల్ల మనసుకి, శరీరానికి థెరపీటిక్ ఎఫెక్ట్ అనిపిస్తుంది.

నేచురల్ పదార్థాలు:

మీరు ఇంట్లోని గాలిని ఫ్రెష్ గా, క్లీన్‌ గా ఉండాలనుకుంటే ప్లాస్టిక్ పదార్థాల బదులు నేచురల్‌ వి వాడడం చాలా మంచిది. దీని వల్ల ఇంట్లో గాలి ఫ్రెష్‌గా ఉంటుంది.

ఏసీలను క్లీన్ చేయడం:

ఎవరైతే ఏసీని ఎక్కువగా వాడుతుంటారో వారు కచ్చితంగా రెగ్యులర్‌గా వీటిని క్లీన్ చేస్తూ మెంటెయిన్ చేయాలని నిపుణులు చెబుతున్నారు.

పెంపుడు జంతువులని క్లీన్‌గా ఉంచాలి:

అదే విధంగా చాలా మంది ఇంట్లో పెంపుడు జంతువులని పెంచుతారు. వీటిని ఎప్పటికప్పుడు రెగ్యులర్‌గా క్లీన్‌గా ఉంచుకోవాలి. ఎందుకంటే వీటి ద్వారా ఎక్కువ క్రిములు వస్తుంటాయి. అందుకే వీటిని కాస్తా క్లీన్‌గా ఉంచడం మంచిది.