Site icon HashtagU Telugu

Blackheads & Whiteheads : బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ నొప్పి లేకుండా తీయాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..

Follow These Simple Tips To Remove Blackheads And Whiteheads Without Pain.

Follow These Simple Tips To Remove Blackheads And Whiteheads Without Pain.

Tips to remove Blackheads and Whiteheads without Pain : ఈ రోజుల్లో స్త్రీ పురుషులు చాలా మంది అనేక రకాల చర్మ సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అటువంటి వాటిలో ఈ బ్లాక్ హెడ్స్ (Blackheads), వైట్ హెడ్స్ (Whiteheads) సమస్య కూడా ఒకటి. ఎక్కువగా ముఖం ముక్కు భాగంలో ఇవి వస్తూ ఉంటాయి. అయితే వీటిని తగ్గించుకోవడానికి చాలా మంది మార్కెట్లో దొరికే కెమికల్ బ్యూటీ ప్రోడక్ట్ లను ఉపయోగిస్తూ ఉంటారు. వాటి వల్ల ఫలితం లభించక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి దిగులు చెందుతూ ఉంటారు. అంతేకాకుండా ఎందుకోసం చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే మీరు కూడా ఈ బ్లాక్ హెడ్స్ (Blackheads), వైట్ హెడ్స్ (Whiteheads)ని తగ్గించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే..

We’re now on WhatsApp. Click to Join.

ఎలాంటి ఖర్చు అలాగే నొప్పి తెలియకుండా ఇంట్లోనే రిమూవ్ చేసుకోవచ్చు. మొదట ముఖానికి ఆవిరి పట్టుకోవాలి. తర్వాత ఆవిరి పట్టిన లేదా వేడినీళ్లలో ఒక క్లాత్ ని ముంచి దానిని తో మసాజ్ చేసిన సరిపోతుంది. ఆ తర్వాత హెయిర్ పిన్ లేదా సారీ పిన్ వెనక భాగంతో బ్లాక్ హెడ్స్ లేదా వైట్ హెడ్స్ ని ఒత్తడం వలన చాలావరకు బయటికి వచ్చేస్తాయి. అయినప్పటికీ కొన్ని బ్లాక్ హెడ్స్ అలాగే ఉంటే వాటిని తీసేయడం కోసం ఒక స్క్రబ్ ని వాడవచ్చు. ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ టూత్ పేస్ట్ ని ఒక స్పూన్ బియ్యప్పిండి, ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ షుగర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని వైట్ హెడ్స్ అలాగే బ్లాక్ హెడ్స్ పైన పెట్టి స్క్రబ్ చేసుకోవాలి. ఆ తర్వాత నీటితో క్లీన్ చేసుకోవాలి.

ఈ విధంగా చేసుకుంటే వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. వీటిని తొలగించే పద్ధతిలో ఫోర్స్ ఓపెన్ అయి ఉంటాయి. ఫోర్స్ ఓపెన్ అయి ఉండడం వలన పింపుల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కావున ఫోర్స్ క్లోజ్ అవ్వడం కోసం ఏదైనా ప్యాక్ ను అప్లై చేసుకోవాలి. దీనికోసం బాగా పండిన అరటిపండు తీసుకొని అరటిపండు నీ మెత్తగా స్మాష్ చేసి దానిలో ఒక చెంచా మిల్క్ పౌడర్, ఒక చెంచా గోధుమపిండి కొన్ని పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్ పై పెట్టుకుని ఆరే వరకు ఉండాలి. తర్వాత నీటితో శుభ్రంగా మసాజ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే క్లోజ్ అయిపోతాయి. అలాగే చర్మంపై ఉండే అన్ని రకాల సమస్యలు కూడా రిమూవ్ అయితాయి.

Also Read:  UPI Payments : యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే..