Summer Hair Care: వేసవిలో జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారా.. వెంటనే ఇలా చేయండి!

  • Written By:
  • Publish Date - April 3, 2024 / 07:43 PM IST

ప్రస్తుత రోజుల్లో జుట్టు ఎక్కువగా రాలిపోవడం అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. దీని కారణంగా చాలామంది పొట్టి జుట్టు, పలుచని జుట్టు లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కొందరిలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలా అధికంగా హెయిర్ ఫాల్ అవుతుంటే అలాంటి సమయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. మరీ ముఖ్యంగా వేసవిలో కూడా జుట్టు విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. మరీ వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వేసవిలో స్కాల్ప్‌లో ఈ ఇన్సులేషన్ కారణంగా, జుట్టు రాలే సమస్య ఎక్కువుతుంది.

We’re now on WhatsApp. Click to Join

అధిక ఉష్ణోగ్రతలు, చమట కారణంగానూ హెయిర్‌ ఫాల్‌, జుట్టు జిడ్డుగా మారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సీజన్‌ కొన్ని టిప్స్‌ ఫాలో అయితే జట్టును సంరక్షించుకోవచ్చు. వేసవిలో మీ హెయిర్‌ను కాపాడుకోవడానికి ఫాలో అవ్వాల్సిన సింపుల్‌ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వేసవిలో చెమట ఎక్కువగా పడుతుంది. దీని కారణంగా తలపై మురికి, నూనె, దుమ్ము పేరుకుపోతుంది. దీని వల్ల రంధ్రాలు మూసుకుపోతాయి, స్కాల్ప్‌ ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది, ఇది జుట్టు రాలడానికి దారితీస్తుంది. ఈ సమస్యను నివారించడానికి, వారానికి రెండుసార్లు తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి.

Also Read: Hair Tips: నూనెలో ఇవి వేసి జుట్టుకు అప్లై చేస్తే చాలు..జుట్టు ఒట్టుగా పెరగాల్సిందే?

ఈ సీజన్‌లో వేడి నీళ్లతో తలస్నానం చేస్తే జుట్టుకు హాని జరుగుతుంది. వేడి నీరు తలలో ఉండే సహజ నూనెలను తొలగిస్తుంది. ఇది హెయిర్‌ ఫాల్‌ సమస్యకు దారితీస్తుంది. దీనికి బదులుగా చల్లని, గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. అధిక సూర్యరశ్మి మీ జుట్టును దెబ్బతీస్తుంది. దీని కారణంగా హెయిర్‌ ఫాల్‌ సమస్య ఎక్కువవుతుంది. దుమ్ము, ధూళి, ఎండ నుంచి మీ జుట్టును రక్షించుకోవడానికి క్యాప్‌, స్కార్ఫ్‌, సన్‌ ప్రొటెక్షన్‌ హెయిర్‌ స్ప్రోని స్ప్రే చేయండి. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు, మధ్యాహ్నం పూట బయటకు వెళ్లకుండా ఉండటానికి ప్రయత్నించాలి. వేసవిలో చెమట, వేడిని తట్టుకోలేక పోనీటైలే‌, బన్‌, ముడి వేసుకుంటూ ఉంటారు. జుట్టును చాలా గట్టిగా కుట్టుకుంటే హెయిర్‌ ఫాల్‌ సమస్య ఎదురవుతుంది. ఇది మీ జుట్టు కుదుళ్లపై ఒత్తిడి తెచ్చి రాలిపోయేలా చేస్తుంది. మీ జుట్టును లాజ్‌గా ఉంచాలి. దువ్వెన పళ్లు దూరంగా ఉండే.. వాటిని వాడాలి. దీని వల్ల మీ జుట్టును లాగకుండా ఉంటారు.

Also Read; Hair Tips: తల స్నానం వేడి నీటితో చేస్తే మంచిదా.. లేక చల్ల నీటితో చేస్తే మంచిదా?

మీ జుట్టుకు నష్టం జరగకుండా ఉండాలంటే మృదువైన పళ్లు, చెక్క దువ్వెనను ఉపయోగించడం మంచిది. సమ్మర్‌ చాలా మంది జుట్టుకు నూనె పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. జుట్టుకు నూనె పెడితే హెయిర్‌కు అవసరమైన తేమ, పోషణ లభిస్తుంది. నూనె జుట్టును సూర్యరశ్మి నుంచి రక్షిస్తుంది, మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. మీరు కొబ్బరి నూనె, బాదం, ఆలివ్‌ నూనె ఉపయోగించాలి. జెల్, హెయిర్‌స్ప్రే వంటి హెయిర్ స్టైలింగ్ ఉత్పత్తులలో జుట్టుకు హాని కలిగించే కఠినమైన రసాయనాలు ఉంటాయి. ఈ ఉత్పత్తులు మీ జుట్టును పొడిగా, పెళుసుగా మార్చుతాయి. దీని కారణంగా జుట్టు రాలే సమస్య ఎక్కువవుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి పోషకాహారం చాలా అవసరం. మీ ఆహారంలో ప్రొటీన్లు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్‌, మినరల్స్‌ ఉన్న సమతుల ఆహారం తీసుకోండి. మీ డైట్‌లో కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోండి. రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలి.