Site icon HashtagU Telugu

Depression : ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అయితే మీరు ఒత్తిడిని జయించినట్లే..!!

Depression Imresizer

Depression Imresizer

ఒత్తిడి అనేది ఒక మానసిక రుగ్మత. ఈ మధ్యకాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఇది. మానసిక ఒత్తిడి అనేది ఎలా వస్తుందనేది అర్థం కాదు.జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు…భావోద్వేగాలకు గురికావడం వల్ల మానసిక ఒత్తిడి అనేది మొదలవుతుంది. చదువు, చేరుకోవల్సిన లక్ష్యాలు, పోటీ ప్రపంచంతోపాటు పరుగెత్తాలన్న ఆశతో మానసికంగా అలసిపోవం ఇవన్నీ కూడా డిప్రెషన్ కు దారి తీస్తాయి. అయితే డిప్రెషన్ను దగ్గరకు రానీయకుండా చేసే కొన్ని చిట్కాలు, సలహాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

ఒత్తిడికి లోనైనప్పుడు గుండె వేగాన్ని పెంచుతుందని మాయో క్లినిక్ నివేదిక పేర్కొంది. దీంతోపాటు చెమట, అలసట, బలహీనంగా అనిపించడం, హైపర్ వెంటిలేషన్ (వేగంగా శ్వాస తీసుకోవడం) భయం, మొదలైన సమస్యలు ఎదుర్కొంటారు. ముందుగా మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఈ లక్షణాలలో ఏదైనా ఉన్నట్లు అనిపిస్తే…ప్రశాంతంగా ఉండండి. కానీ అంత సులభం కాకపోవచ్చు. కానీ కష్టపడి ప్రయత్నిస్తే…తప్పకుండా విజయం సాధిస్తారు.

1. ఒత్తిడి, డిప్రెషన్ నుండి ఉపశమనం పొందడానికి చమోమిలే టీని తీసుకోండి. ఇది ఒత్తిడిని తగ్గించే అవసరమైన పోషకాలన్నీ ఇందులో ఉన్నాయి.
2. యోగా ధ్యానం: మానసిక రుగ్మతలను నయం చేసేందుకు ప్రాచీన కాలం నుంచి యోగాను ఫాలో అవుతున్నారు. ఒత్తిడిని జయించాలంటే యోగా, ధ్యానం చేయండి.

3. కొన్ని శ్వాస వ్యాయామాలు చేయండి. మీరు ఒత్తిడికి గురైనప్పుడు, ఆ సమయంలో కొన్ని శ్వాస వ్యాయామాలు చేయడం మంచిది.

4. మీ ఆహారంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేలా చూసుకోండి. దీంతో ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.