Dark Circles Under Eyes : కళ్ళ కింద నల్లని వలయాలు తగ్గడానికి ఈ ఇంటి చిట్కాలు పాటించండి..

కళ్ళ కింద నల్లని వలయాలు తగ్గడానికి మనం కొన్ని చిట్కాలను ఉపయోగించవచ్చు.

  • Written By:
  • Publish Date - October 26, 2023 / 08:37 PM IST

ఈ రోజుల్లో మన మీద పడే దుమ్ము, ధూళి, కాలుష్యం వలన కళ్ళ కింద నల్లని వలయాలు(Dark Circles) ఏర్పడతాయి. ఇంకా ఈ రోజుల్లో ఎక్కువసేపు ఫోన్(Phone) చూడడం లేదా ల్యాప్ ట్యాప్(Laptop) లలో వర్క్ చేసుకోవడం వలన కూడా కళ్ళ కింద నల్లని వలయాలు ఏర్పడతాయి. నిద్రలేమి వలన కూడా కళ్ళ కింద నల్లని వలయాలు ఏర్పడతాయి. కాబట్టి కళ్ళ కింద నల్లని వలయాలు తగ్గడానికి మనం కొన్ని చిట్కాలను ఉపయోగించవచ్చు.

టమాటాలు జ్యూస్ చేసి దానిలో కొద్దిగా నిమ్మరసం కలిపి దానిని కళ్ళ కింద రాసుకోవాలి పావుగంట తరువాత చల్లని నీటితో కడుగుకోవాలి ఇలా రెగ్యులర్ గా చేయడం వలన కళ్ళ కింద నల్లని వలయాలు, మచ్చలు ఉంటే తగ్గుతాయి. ప్రతిరోజూ రాత్రి పూట పడుకునే ముందు మన కళ్ళ కింద కొబ్బరినూనె లేదా ఆల్మండ్ ఆయిల్ తో మసాజ్ చేసుకోవాలి. ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.

ఆరెంజ్ జ్యూస్ లో కొద్దిగా గ్లిజరిన్ కలిపి దానిని మన కళ్ళ కింద నల్లని వలయాలు లేదా మచ్చలు ఉన్నచోట రాసుకోవాలి పదిహేను నిముషాల తరువాత చల్లని నీటితో కడుగుకోవాలి. ఇలా చేయడం వలన నల్లని మచ్చలు తగ్గుతాయి. బంగాళాదుంప గుజ్జును కళ్ళ కింద నల్లని వలయాలు ఉన్న చోట పెట్టుకుంటే అవి తగ్గుముఖం పడతాయి. కీరదోసకాయ, నిమ్మరసం కలిపి దానిని కళ్ళ కింద మసాజ్ చేసిన విధంగా మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వలన కళ్ళ కింద నల్లని వలయాలు తగ్గుతాయి. ఈ విధంగా మనం కళ్ళ కింద ఉన్న నల్లని వలయాలను తగ్గించుకోవచ్చు. ఇంకా మనం తీసుకునే ఆహారంలో విటమిన్లు ఎక్కువగా ఉన్నవి పీనట్ బటర్, కొబ్బరి, ఆకుకూరలు, అన్ని రకాల కూరగాయలు తీసుకోవాలి. ఇలా చేయడం వలన కూడా కళ్ళ కింద నలుపుదనం తగ్గుతుంది.

 

Also Read : Immunity : వీటికి దూరంగా ఉండండి.. లేదా శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది..