Prevent Cancer: వీటికి దూరంగా ఉంటే.. క్యాన్స‌ర్ ముప్పు తొలిగిన‌ట్లే..!

పాశ్చాత్య దేశాల్లో మూడింట ఒక వంతు ఆహారం వల్లే క్యాన్సర్ బారిన పడుతున్నారని సర్వేలు తేల్చి చెబుతున్నాయి.

  • Written By:
  • Publish Date - October 3, 2022 / 09:15 AM IST

పాశ్చాత్య దేశాల్లో మూడింట ఒక వంతు ఆహారం వల్లే క్యాన్సర్ బారిన పడుతున్నారని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. ప్రస్తుత జ‌న‌రేష‌న్‌లో క్యాన్సర్ బాధితుల‌ సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. క్యాన్స‌ర్ రావ‌డానికి ఎన్నో కార‌ణాలున్నాయి. క్యాన్స‌ర్ కేసుల‌లో 50శాతం పైగా జీవ‌న‌శైలి, ఎక్స్‌ర్‌సైజ్‌, మ‌ద్య‌పానం, ధూమ‌పానం, అధిక బ‌రువు, త‌దిత‌ర కార‌ణాల వ‌ల‌న క్యాన్స‌ర్ బారిన‌ప‌డుతున్నారని నిపుణులు పేర్కొన్నారు.

క్యాన్సర్ కేసులలో సగానికి పైగా చెడు జీవనశైలి, వ్యాయామం చేయకపోవడం, ధూమపానం, మద్యపానం, అధిక బరువు మొదలైన వాటి వల్లే సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే జీవనశైలి క్యాన్సర్‌పై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఆరోగ్యకరమైన ఆహారాలను అలవాటు చేసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు తప్పే అవకాశం తక్కువగా ఉంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారాలు క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడతాయి. అయితే.. క్యాన్సర్‌ను నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం రండి.

సాల్టెడ్ ఫుడ్స్: సాల్టెడ్, ఎండిన ఆహార పదార్థాలను మోతాదుకు మించి తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఈ ఆహారాల్లో ఉండే నైట్రేట్ కడుపులోని జీర్ణ రసాలతో ప్రతిస్పందిస్తుంది. నైట్రోసమైన్ అని పిలువబడే క్యాన్సర్ ప్రేరిత పదార్థంగా మారుతుంది. ఈ రసాయనం క్యాన్సర్‌కు కారణమవుతుంది.

రెడ్ మీట్: రెడ్ మీట్ వ‌ల‌న చాలా ఉప‌యోగాలు ఉన్నాయి. ఈ మీట్‌లో ప్రోటీన్స్ పుష్క‌లంగా ఉంటాయి. కానీ ఇది భుజిస్తే క్యాన్స‌ర్ ప్ర‌మాదం పెరుగుతుందని ప‌లు ప‌రిశోధ‌న‌లు, అధ్య‌య‌నాలు తెలుపుతున్నాయి. అందుకే ముందు జాగ్రత్త‌గా మీరు తీసుకునే ఆహారంలో ఈ రెడ్ మీట్ తక్కువగా ఉండేలా చూసుకోండి.

వేడి చేసిన ఆయిల్‌ వాడటం: మ‌నం ఇళ్ల‌లో చూస్తుంటాం. ఒక్క‌సారి వేడి చేసిన నూనెను ప‌దే ప‌దే వాడుతుంటారు. అలా ప‌దే ప‌దే వేడి చేసిన నూనెను వాడ‌టం హెల్త్‌కు మంచిది కాదు. నూనెను మ‌ళ్లీ మ‌ళ్లీ వేడి చేసి వాడ‌టం వ‌ల‌న ఆ నూనెలో క్యాన్స‌ర్‌కు కార‌ణ‌మ‌య్యే ర‌సాయ‌నాలు ఏర్ప‌డ‌తాయ‌ని ప‌లు అధ్య‌య‌నాలు పేర్కొన్నాయి.

బూజు పట్టిన ఆహారాలు: మ‌న ఆరోగ్యం మ‌న చేతుల్లోనే ఉంది. మ‌న తీసుకునే ఆహారాలే మ‌న హెల్త్ మీద ప్ర‌భావం చూపుతాయి. కొంత‌మంది బూజుప‌ట్టిన ఆహారాల‌ను కూడా తింటుంటారు. అలాంటి ప‌దార్థాల‌ను తిన‌కూడ‌దు. చిక్కుళ్లు, తృణ‌ధాన్యాల్లో క‌నిపించే అఫ్లాటాక్సిన్ అనే బూజు సంక్ర‌మ‌ణ క్యాన్స‌ర్‌కు కార‌ణ‌మ‌వుతుంద‌ని అధ్య‌యానాలు పేర్కొంటున్నాయి.