Site icon HashtagU Telugu

Lip Care: నల్లగా ఉన్న మీ పెదాలు లేత గులాబీ రంగులోకి మారాలంటే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే?

Mixcollage 22 Jan 2024 06 31 Pm 2400

Mixcollage 22 Jan 2024 06 31 Pm 2400

మాములుగా చాలామందికి పెదాలు నల్లగా ఉండడం మనం గమనించే ఉంటాం. అయితే కొంతమందిఈ నల్లని పెదాల వల్ల గిల్టీగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఎరుపు రంగులో ఉండే పెదాలు కావాలని కోరుకుంటూ ఉంటారు. పెదవులను ఎర్రగా మార్చుకోవడం కోసం ఎన్నో రకాల చిట్కాలను, మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ పెదాలు ఎర్రగా మారలేదని దిగులు చెందుతూ ఉంటారు. అయితే నల్లని పెదాలను ఎర్రగా మార్చుకోవాలని మీరు కూడా ప్రయత్నిస్తున్నారా. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాలు పాటిస్తే చాలు. నల్లటి పెద్దలు అయినా సరే గులాబీ రంగులోకి మారడం ఖాయం..

పెదవులు సహజంగా ఆకర్షణీయంగా కనిపించాలంటే స్క్రబ్బింగ్‌ చాలా ముఖ్యం. మీరు పెదాలను ఎక్స్‌ఫోలియేట్‌ చేయడానికి ఇంట్లోనే న్యాచరల్‌ స్క్రబ్‌ తయారు చేసుకోవచ్చు. ఒక టీస్పూన్ చక్కెరలో తేనె లేదా కొబ్బరి నూనె మిక్స్‌ చేసిన ఈ మిశ్రమంతో మీ పెదవులను సున్నితంగా స్క్రబ్‌ చేయాలి. చక్కెర పెదవులపై ఉన్న మృతకణాలను తొలగిస్తుంది. కొబ్బరి నూనె, తేనె పెదవులకు తేమనందిస్తాయి. మరో చిట్కా విషయానికి వస్తే.. గోరు వెచ్చని నీళ్లలో మెత్తటి టూత్‌ బ్రష్‌ ముంచి సున్నితంగా పెదవులుపై స్క్రబ్‌ చేయాలి. ఇలా చేస్తే అది మీ డెడ్‌ స్కిన్‌ సెల్స్‌ను తొలగిస్తుంది. రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. మీ పెదాల సహజ రంగును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అలాగే మీ పెదవులను ఆరోగ్యంగా, గులాబీ రంగులో మెయింటేన్‌ చేయడానికి హైడ్రేషన్‌ కీలకం. మీ పెదవులను హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి రోజూ సరిపడా నీళ్లు తాగాలి.

పొడిబారిన, పగిలిన పెదవులు ముదురు రంగులో కనిపిస్తాయి. కాబట్టి వాటిని తేమగా ఉంచుకోవాలి. రోజూ కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి. మీ పెదవులకు తేమనందించడానికి.. షియా బటర్, కోకో బటర్, ఆల్మండ్ ఆయిల్ వంటి సహజ పదార్థాలు ఉన్న నాణ్యత గల లిప్‌ బామ్‌ను వాడండి. దీన్ని రెగ్యులర్‌గా అప్లై చేయడం వల్ల మీ పెదవులు మృదువుగా, నల్లబడకుండా ఉంటాయి. పెదవులను తేమగా ఉంచడానికి కొందరు తరచు పెదవులును తడుపుతూ ఉంటారు. ఇలా చేస్తే పెదవులు త్వరగా పొడిబారతాయి, నల్లగా మారతాయి. లాలాజలంలో మీ సున్నితమైన చర్మాన్ని కఠినంగా మార్చే ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి మీ పెదవులను నల్లగా మారుస్తాయి. పిగ్మంటేషన్‌ను దూరం చేయడానికి స్క్రబ్బింగ్‌ చేసిన తర్వాత పెదాలకు మాస్క్‌ తప్పనిసరి. బీట్‌రూట్‌ దుంపను సన్నగా తురిమి మిక్సీపట్టి మెత్తని పేస్టులా చేయాలి. చెంచా పేస్టుకు చెంచా చొప్పున పాలు, తేనె కలిపిన మిశ్రమాన్ని పెదాలకు మాస్క్‌లా వేసి పావుగంట ఆరనిచ్చి చల్లని నీటితో శుభ్రం చేయాలి. అలాగే చెంచా తేనెలో నాలుగైదు చుక్కల తేనె కలిపి పెదాలకు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగినా చాలు. ఇలా వేసే మాస్క్‌లు అధరాలను మృదువుగా మార్చడమే కాదు, పిగ్మంటేషన్‌ నుంచి దూరం చేస్తాయి. పైన చెప్పిన చిట్కాలు జాగ్రత్తలు పాటిస్తే చాలు నల్లటి రంగులో ఉన్న పెదాలు ఎరుపు రంగులో మారడం ఖాయం.