Site icon HashtagU Telugu

Honey for Face: ముఖంపై నల్లటి మచ్చలు మాయం అవ్వాలంటే తేనెలో ఇవి కలిపి రాస్తే చాలు?

Mixcollage 05 Feb 2024 12 29 Pm 2439

Mixcollage 05 Feb 2024 12 29 Pm 2439

మనం తరచుగా ఉపయోగించే వాటిలో ఎప్పటికీ పాడవని ఒకే ఒక పదార్థం తేనె. స్వచ్ఛమైన తేనె ఎప్పటికీ పాడవదు అన్న విషయం మనందరికీ తెలిసిందే. దీనిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. తేనెలో క్యాల్షియం, ఐరన్‌, సోడియం, ఫాస్ఫరస్‌, సల్ఫర్‌, పొటాషియం, విటమిన్‌ సి, బి వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. తేనె ఆరోగ్యాన్ని రక్షంచడానికే కాదు సౌందర్య సంరక్షణకు సహాయపడుతుంది. తేనెలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు చర్మ సంరక్షణకు మేలు చేస్తాయి. సూర్యరశ్మి, హార్మోన్ల మార్పుల, వృద్ధాప్యం కారణంగా చాలా మంది మహిళలు డార్క్‌ స్పాట్స్‌తో బాధపడుతుంటూ ఉంటారు. తేనె నల్ల మచ్చలను తేలికపరచి చర్మం రంగుతో సమం చేయడానికి సహాయపడుతుంది.

మీరు నల్ల మచ్చలతో బాధపడుతుంటే ఈ ఐదు ఫేస్‌ మాస్క్‌ మీకు సహాయపడతాయి. నిమ్మరసం వంటి నేచురల్ స్కిన్ లైట్నర్స్ చర్మంపై డార్క్ స్పాట్స్‌ను తగ్గించడంలో సహాయపడుంది. ఈ ఫేస్ మాస్క్‌ను తయారు చేయడానికి ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ లెమన్‌ జ్యూస్‌ మిక్స్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసిన తర్వాత 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి రిజల్ట్స్‌ ఉంటాయి. పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మంటను తగ్గిస్తాయి. చర్మ సమస్యలను నయం చేస్తాయి.

ఈ ఫేస్ మాస్క్ చేయడానికి ఒక టేబుల్ స్పూన్ తేనెకు చిటికెడు పసుపు పొడి కలిపి మిశ్రమాన్ని తయారు చేయాలి. ఆ తర్వాత ముఖానికి అప్లై చేసి 10 – 15 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖంపై నల్లటి మచ్చలు తగ్గుతాయి. దాల్చినచెక్కలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. మొటిమలతో బాధపడేవారికి దాల్చిన మంచి మెడిసిన్‌ అనొచ్చు. అంతేకాకుండా, రక్త ప్రసరణను మెరుగుపరచి.. డార్క్‌ స్పాట్స్‌ను తగ్గిస్తుంది. ఈ ఫేస్‌ మాస్క్‌ తయార చేయడానికి ఒక టేబుల్ స్పూన్ తేనెలో చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి మిక్స్‌ చేసి ఆ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. మంచి రిజలట్స్‌ కోసం వారానికి రెండు సార్లు అప్లై చేయాలి.

అలాగే బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి, డార్క్ స్పాట్స్ రూపాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. పండిన బొప్పాయి గుజ్జు ఒక టేబుల్ స్పూన్ తీసుకుని, దానిలో తేనె కలిపి మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకోండి. ఈ మిశ్మాన్ని ముఖానికి అప్లై చేసి 15 – 20 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా మంచి రిజల్ట్స్‌ కోసం వారానికి ఒక సారి ఈ మాస్క్‌ అప్లై చేసుకోవడం చాలా మంచిది.