Beauty Tips : వీటిని తింటే వయస్సు పెరిగినా…40లోనూ 20వలే కనిపిస్తారు…!!!

వయస్సు మీద పడుతుందా...అయినా అందంగా కనిపించాలనుకుంటున్నారా..40ఏళ్లు దాటినా చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలనుకుంటున్నారా...అయితే సహజంగా కొల్లాజెన్ తీసుకునేందుకు ప్రయత్నించండి.

  • Written By:
  • Publish Date - June 27, 2022 / 08:30 AM IST

వయస్సు మీద పడుతుందా…అయినా అందంగా కనిపించాలనుకుంటున్నారా..40ఏళ్లు దాటినా చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలనుకుంటున్నారా…అయితే సహజంగా కొల్లాజెన్ తీసుకునేందుకు ప్రయత్నించండి. కొల్లాజెన్ ప్రొటిన్ అనేది చర్మాన్ని అందంగా ఉంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. చర్మంలోని కణజాల కణాలను బలపరుస్తుంది. దానికి నిర్మాణానికి సహాయపడుతుంది. ఎముకలను బలంగా ఉంచుతుంది.

మానవ శరీరానికి సహజంగా కొల్లాజెన్ను తయారు చేసే సామార్థ్యం ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ దీని ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. చర్మం స్థితిస్థాపకత, బిగుతును కోల్పోతుంది. చర్మంపై ముడతలు గీతలు ఏర్పడుతుంటాయి. మేకమాంసం, పందిమాంసం, గుడ్లు, చికెన్ లాంటి వాటిలో కొల్లాజెన్ పుష్కలంగా లభిస్తుంది. కొల్లాజెన్ కోసం చాలామంది సప్లిమెంట్స్ వాడుతుంటారు. అయితే చాలా అసహజమైన పద్ధతి అని నిపుణులు అంటున్నారు. కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటే సహజ కొల్లాజెన్ను పొందవచ్చు. వయస్సు పెరుగుతున్నా అందంగా ఉండవచ్చు.

కొల్లాజెన్ ఉండే ఆహారపదార్థాలు.
1. బోన్ సూప్.
ఈ బోన్ సూప్ ఎముకలతోతయారు చేస్తారు. శరీరంలో సహజ కొల్లాజెన్ ఉత్పత్తి చేయడంలో సహాయపడే ఖనిజాలు కలిగి ఉంటాయి. రోజువారీ ఆహారంలో బోన్‌సూప్‌ను చేర్చుకుంటే దీర్ఘ‌కాలంలో చ‌ర్మం మెరిసిపోతుంది. కీళ్ల ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది.

2. చికెన్‌:
చికెన్‌లో ఉన్నంత క‌నెక్టివ్ టిష్యూస్‌ మ‌రే ఇత‌ర ఆహారంలో ఉండ‌వు. చికెన్ నెక్, మృదులాస్థిని త‌రుచూ తీసుకుంటే మ‌న చ‌ర్మానికి కావాల్సినంత స‌హ‌జ కొల్లాజెన్ అందుతుంది. కీళ్ల ఆరోగ్యానికి కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది.

3.గుడ్డులోని తెల్లసొన

గుడ్డులోని తెల్లసొనలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కొల్లాజెన్ ఉత్పత్తికి అవసరమైన అమైనో యాసిడ్‌లలో ఒకటైన ప్రోలిన్ ఇందులో అధికంగా ఉంటుంది. చ‌ర్మ నిగారింపుకోసం రోజువారీ ఆహారంలో గుడ్డులోని తెల్ల‌సొన చేర్చుకుంటే మంచిది.

4. సిట్రస్ పండ్లు

కొల్లాజెన్ ఉత్పత్తిని విటమిన్ సి విపరీతంగా పెంచుతుంది. నారింజ, నిమ్మ, ఫైనాపిల్, గ్రేప్ ఫ్రూట్ మొదలైన పండ్లలో విటమిన్ సీ అధిక మోతాదులో ఉంటుంది. వీటిని ఏదోరూపంలో ప్ర‌తిరోజూ తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు.

5. వెల్లుల్లి

వెల్లుల్లి ఆహారానికి రుచిని అందించ‌డంతోపాటు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. వెల్లుల్లిలో సల్ఫర్ అధిక మోతాదులో ఉంటుంది. కొల్లాజెన్ విచ్ఛిన్నం కాకుండా సంశ్లేషణ చేయడంలో వెల్లుల్లి సహాయపడుతుంది.