Site icon HashtagU Telugu

Hair Fall: హెయిర్ ఫాల్ సమస్య తగ్గాలంటే ఈ ఐదు రకాల చిట్కాలను పాటించాల్సిందే?

Hair Fall

Hair Fall

ప్రస్తుత రోజుల్లో స్త్రీ పురుషులు చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో హెయిర్ ఫాల్ సమస్య కూడా ఒకటి. హెయిర్ ఫాల్ కు అనేక కారణాలు ఉన్నాయి. హెయిర్ ఫాల్ సమస్య కారణంగా జుట్టు మొత్తం ఊడిపోయి జుట్టు పల్చగా అవ్వడం లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆహారం, యూవీ కిరణాలు, ఒత్తిడి కారణంగా జుట్టు రాలిపోడవం, పొడిబారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అలా హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడేవారు ఐదు రకాల చిట్కాలను ఉపయోగించడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. మరి ఆ ఐదు రకాల చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఉల్లిలో ఉండే జింక్‌, సల్ఫర్‌, ఫోలిక్‌యాసిడ్‌, బి విటమిన్‌, పొటాషియం జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఉల్లిపాయ రసంలోని సల్పర్‌ కొల్లాజెన్‌ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. దీంతో జుట్టు కుదుళ్లు దృఢంగా మారతాయి, కొత్త జుట్టు రావడం మొదలవుతుంది. ఉల్లిపాయ రసాన్ని మీ తలకు అప్లై చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మీ కుదుళ్లకు పోషణ లభిస్తుంది. ఉల్లిపాయను గ్రైండ్ చేసి దానినుంచి రసం తీసి ఆ రసాన్ని తలకు పట్టించి. 15 నిమిషాల పాటు ఆరనిచ్చి, తేలికపాటి షాంపూతో తలస్నానం చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే కొబ్బరి నూనె సహజమైన మాయిశ్చరైజర్. ఇది జుట్టు చిట్లడం, జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. దీనికీ యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇది మీ స్కాల్ప్‌ను ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. మీరు హెయిర్‌ ఫాల్‌ సమస్యతో బాధపడుతుంటే.. కొబ్బరి నూనెను డబుల్‌ బాయిలర్‌ విధానంలో వేడి చేసి తలకు అప్లై చేసి మసాజ్‌ చేయాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయం తలస్నానం చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. అదేవిధంగా మెంతులలో ప్రొటీన్లు, నియాసిన్‌, అమైనో యాసిడ్స్‌, పొటాషియం,ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి హెయిర్‌ ఫాల్‌ సమస్యను దూరం చేసి జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. మెంతి గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయం పేస్ట్‌ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని మీ తలకు పట్టించి 30 నిమిషాల పాటు ఆరనిచ్చి ఆ తర్వాత తలస్నానం చేయాలి.

అలాగే కలబందలో ఉండే ఔషధ గుణాలు జుట్టు పెరుగదలను ప్రోత్సహిస్తాయి, జుట్టు రాలడాన్ని నిరోధిస్తాయి. కలబందలోని ఎంజైమ్స్‌ హెయిర్‌ ఫాల్‌ను కంట్రోల్‌ చేస్తాయి. కలబంద గుజ్జును మీ తలకు అప్లై చేసి 30 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత మైల్డ్‌ షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జుట్టు కుదుళ్లను దెబ్బతినకుండా కాపాడతాయి. ఇందులో కేటెచిన్స్ కూడా ఉంటాయి, ఇవి హెయిర్‌ గ్రోత్‌ను ప్రోత్సహిస్తాయి. ఒక కప్పు నీటిలో స్పూన్‌ గ్రీన్‌ టీ వేసి మరిగించండి. ఆ నీళ్లు చల్లారిన తర్వాత తలకు పట్టింటి ఒక గంట తర్వాత తల శుభ్రం చేసుకోవాలి.