Site icon HashtagU Telugu

Fish Fry: అరటిఆకులో టేస్టీ చేపల ఫ్రై.. ఇలా చేస్తే మొత్తం ఖాళీ అవ్వాల్సిందే?

Mixcollage 22 Mar 2024 09 24 Pm 6122

Mixcollage 22 Mar 2024 09 24 Pm 6122

మాములుగా అరటి ఆకులలో చేపలు, చికెను మటన్ వంటివి వండడం మనం యూట్యూబ్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇలాంటి వంటకాలు మనకు ఎక్కువగా కేరళ సైడ్ చేస్తూ ఉంటారు. ఆంధ్ర తెలంగాణలో కూడా చాలామంది డిఫరెంట్ గా చేయాలి అని ఇలా కట్టెల పొయ్యి మీద ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటారు. అరటి ఆకులో వండడం వల్ల ఆ ఆకులో ఉన్న పోషకాలు కూడా చేపకు చేరుతాయి. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు :

చేప ముక్కలు – రెండు
అరిటాకు – చేపలు చుట్టడానికి సరిపడా
పచ్చిమిర్చి తరుగు – రెండు స్పూనులు
కొబ్బరి తురుము – రెండు స్పూనులు
కొత్తిమీర తరుగు – రెండు స్పూనులు
కారం – ఒక స్పూను
పసుపు – పావు స్పూను
ధనియాల పొడి – అర స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను
ఉల్లిపాయల తరుగు – రెండు స్పూనులు
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – ఒక స్పూను
కరివేపాకులు – గుప్పెడు
నిమ్మరసం – రెండు స్పూనులు

తయారీ విధానం :

ఇందుకోసం చేప ముక్కలు కాస్త పెద్దవి తీసుకోవాలి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి తురుము, కొత్తిమీర కలిపి మిక్సీలో మెత్తటి పేస్టులా చేసుకోవాలి. ఒక గిన్నెలో కారం, పసుపు, ఉప్పు, నిమ్మరసం, ధనియాల పొడి, మిక్సీలో చేసుకున్న మెత్తటి పేస్టు వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమంలో కరివేపాకులు కూడా వేసుకోవాలి. అందులో నూనె కూడా వేసి బాగా కలపాలి. తర్వాత మొత్తం మిశ్రమాన్ని చేపలకు బాగా పట్టించాలి. ఒక పావుగంట సేపు పక్కన వదిలేయాలి. ఇక అరటిఆకును చిన్న మంట పై ఇటూ అటూ వేడిచేయాలి. దీని వల్ల ఆకు మెత్తగా మారి చేపను చుట్టడానికి వీలుగా అవుతుంది. ఇప్పుడు అరటి ఆకులో ఒక చేప ముక్కని పెట్టి మడత బెట్టాలి. ఒకసారి కాకుండా రెండు పొరలుగా అరటి ఆకును చుట్టాలి. అరటిఆకు ఊడిపోకుండా దారంతో కట్టాలి. పెనం వేడెక్కాక నూనె వేసి అరటిఆకులో చుట్టిన చేపను పెట్టాలి. రెండు వైపులా బాగా కాల్చాలి. చిన్న మంట మీద కాలిస్తే చేప బాగా ఉడుకుతుంది.

Exit mobile version