Fish Fried Rice: ఎప్పుడైనా ఫిష్ ఫ్రైడ్ తిన్నారా.. ఇంట్లోనే టేస్టీగా తయారు చేసుకోండి?

మామూలుగా మనం చేప కబాబ్,చేప ఫ్రై, చేపల పులుసు, చేపల వేపుడు, చేపల ఇగురు ఇలా చేపలతో కొత్త కొత్త వంటకాలు చేసుకొని తింటూ ఉంటాం. అయితే ఎప్ప

  • Written By:
  • Publish Date - March 19, 2024 / 09:00 PM IST

మామూలుగా మనం చేప కబాబ్,చేప ఫ్రై, చేపల పులుసు, చేపల వేపుడు, చేపల ఇగురు ఇలా చేపలతో కొత్త కొత్త వంటకాలు చేసుకొని తింటూ ఉంటాం. అయితే ఎప్పుడైనా చేపల ఫ్రైడ్ రైస్ తిన్నారా. వినడానికి పేరు కొత్తగా ఉంది కదూ. తింటే టేస్ట్ అదిరిపోతుంది. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో అందుకు ఏమేమి కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు :

ముల్లు తీసిన చేప ముక్కలు – అరకిలో
వండిన అన్నం – మూడు కప్పులు
క్యాప్సికం – ఒకటి
ఉలిపాయ – రెండు
అల్లం – ఒక చిన్న ముక్క
వెల్లుల్లి – పది రెబ్బలు
కొత్తిమీర – ఒక కట్ట
సోయా సాస్ – రెండు టీ స్పూనులు
చిల్లీ సాస్ – రెండు టీ స్పూనులు
మిరియాల పొడి – ఒక టీస్పూను
నూనె – సరిపడినంత,
ఉప్పు – రుచికి తగినంత

తయారీ విధానం :

ఇందుకోసం ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. మీకు నచ్చిన సైజ్ చేప ముక్కల్ని కోసి పెట్టుకోవాలి. చేప ముక్కలకు తడి లేకుండా చూసుకోవాలి. ఒక గిన్నెలో చేప ముక్కలు వేసి సోయాసాస్, మిరియాల పొడి, చిల్లీ సాస్ వేసి ముక్కలకు పట్టేలా చేయాలి. తర్వాత అన్నంలో కాస్త ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో నూనె వేయాలి. నూనె వేడెక్కాక చేప ముక్కల్ని వేసి వేయించాలి. వాటిని ఎర్రగా వేయించి తీసి ఒక గిన్నెలో తీసి వేసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో అల్లం వెల్లుల్లి తరుగుని వేసి వేయించాలి.
నిలువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన కొత్తిమీర, క్యాప్సికమ్ తరుగు వేసి బాగా వేయించాలి. అలాగే ముందు వేయించుకున్న చేప ముక్కలు కూడా వేయాలి.అన్నింటినీ బాగా వేయించాక వండిన అన్నాన్ని వేసి కలపాలి. పైన కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేయాలి.