Site icon HashtagU Telugu

Fish Cake: రెస్టారెంట్ స్టైల్ ఫిష్ కేక్ ఇంట్లోనే సింపుల్ గా తయారు చేసుకోండి ఇలా?

Mixcollage 30 Jan 2024 08 26 Pm 9052

Mixcollage 30 Jan 2024 08 26 Pm 9052

మామూలుగా మనం చేపతో ఎన్నో రకాల రెసిపీలు ట్రై చేసి ఉంటాం. చేప కబాబ్, ఫిష్ ఫ్రై, చేపల పులుసు, చేపల మసాలా కర్రీ ఇలా ఎన్నో రకాల రెసిపీలు తినే ఉంటాం. ఎప్పుడైనా వెరైటీగా ఉండే ఫిష్ కేక్ తిన్నారా. ఒకవేళ ఎప్పుడు తినకపోతే ఈ రెసిపీని ఇంట్లోనే సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఫిష్‌ కేక్‌ కావలసిన పదార్థాలు :

చేప ముక్కలు – 5 లేదా 6
ఉప్పు – రుచికి తగినంత
బంగాళదుంపలు – రెండు
మిరియాల పొడి – అర టీస్పూన్‌
నిమ్మరసం – మూడు టేబుల్‌ స్పూన్లు
కొత్తిమీర – ఒక కట్ట
పచ్చిమిర్చి – రెండు
బ్రెడ్‌ ముక్కలు – అరకప్పు
నూనె – ఒక టీ స్పూన్‌
ఉల్లిపాయ – ఒకటి

ఫిష్ కేక్ తయారీ విధానం:

ఇందుకోసం చేప ముక్కలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసి ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. బంగాళదుంపలను ఉడికించి, పొట్టు తీసి గుజ్జుగా చేసుకోవాలి. ఇప్పుడు చేప ముక్కల్లో పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, బంగాళదుంప గుజ్జు వేసి కలపాలి. నిమ్మరసం, తగినంత ఉప్పు, మిరియాల పొడి కూడా వేసుకోవాలి. తరువాత మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న కేకుల మాదిరిగా చేసుకోవాలి. ఒక ప్లేట్‌లో బ్రెడ్‌ ముక్కలు తీసుకుని ముక్కలకు అద్దాలి. బేకింగ్‌ ట్రేకు నూనె రాసి ఫిష్‌ కేక్‌లను పెట్టాలి. ఓవెన్‌ను 200 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు ప్రీ హీట్‌ చేసుకోవాలి. తరువాత బేకింగ్‌ ట్రేను పావుగంట పాటు ఓవెన్‌లో పెట్టి బేక్‌ చేసుకోవాలి. సర్వింగ్‌ ప్లేట్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి. అంతే రుచికరమైన ఫిష్ కేక్ రెడీ.