Site icon HashtagU Telugu

Fish And Milk: చేపలు తిన్న తర్వాత పాలు తాగితే బొల్లి వ్యాధి వస్తుందా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?

మాంసాహార ప్రియులు ఎక్కువ శాతం మంది ఇష్టపడే వాటిలో చేపలు కూడా ఒకటి. కొంతమంది చేపలు తినడానికి ఇష్టపడరు. మరి కొంతమంది మతం చేపలను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదే కానీ ఎక్కువగా తినడం అస్సలు మంచిది కాదు. అలాగే చేపలు తిన్న తర్వాత కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా అసలు తీసుకోకూడదని చెబుతూ ఉంటారు. అటువంటి వాటిలో పాలు కూడా ఒకటి. చేపలు తిన్న తర్వాత పాలు తాగకూడదని అలా తాగితే చర్మ వ్యాధులు వస్తాయి అని చెబుతూ ఉంటారు.

ముఖ్యంగా బొల్లి వ్యాధి వస్తుందని చెబుతూ ఉంటారు. మరి ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే చేపలు, పాలు అధిక ప్రొటీన్ కలవి. ఈ రెండింటిలోనూ ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. వాటిని జీర్ణం చేసే సమయంలో పెద్ద మొత్తంలో శక్తిని విడుదల చేస్తుంది. ఇది పొట్ట ఉబ్బరం, ఇతర జీర్ణ సమస్యలకు దారితీయవచ్చు. చర్మంపై తెల్లమచ్చలు రావడాన్ని బొల్లిగా పిలుస్తారు. చర్మంలో రంగుకు కారణమయ్యే పిగ్మింటేషన్ స్థాయిలు తగ్గిపోతే బొల్లి వస్తుంది. అదొక ఆటోఇమ్యూన్ వ్యాధి అని దానికి, చేపలు, పాలు కలిపి తినడానికి సంబంధం లేదని కొట్టి పారేస్తున్నారు.

మెలనిన్‌పై పోరాడే యాంటీ బాడీలను రోగ నిరోధక వ్యవస్థ ఉత్పత్తి చేయడం వల్ల బొల్లి వస్తుందని డెర్మలాటజిస్టులు చెబుతున్నారు. చేపలు, పాలు తింటే తెల్ల మచ్చలు వస్తాయనడానికి ఆధారాలూ లేవు. ఏదైనా విపరీతంగా తింటే మీ జీర్ణ వ్యవస్థపై అది ప్రభావం చూపుతుంది. రోడ్ సైడ్ దొరికే కొన్ని రకాల ఫుడ్స్ వల్ల అలర్జీలు రావచ్చు. మరికొంతమందికి కొన్ని ఆహార పదార్థాలు పడకపోవచ్చు. అలాంటప్పుడు వచ్చే అలర్జీలను అందరికీ ఆపాదించకూడదని నిపుణులు అంటున్నారు.

Exit mobile version