Site icon HashtagU Telugu

‎Fenugreek-Fennel Water: ఉదయాన్నే మెంతి,సోంపు కలిపిన నీరు తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Fenugreek Fennel Water

Fenugreek Fennel Water

Fenugreek-Fennel Water: మెంతులు, సోంపు.. ఇవి రెండింటి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా రెండింటినీ కలిపిన నీటిని తాగడం వల్ల ఇంకా అనేక ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. కాగా మెంతులు, సోంపు నీరు జీవక్రియను వేగవంతం చేస్తుందట. ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల కొవ్వు కరగడానికి సహాయపడుతుందని, తరచుగా తీసుకుంటే బరువు కూడా తగ్గుతారని చెబుతున్నారు.

‎అలాగే ఈ నీటిని తీసుకోవడం వల్ల మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయట. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి పొట్టను తేలికగా ఉంచుతుందని చెబుతున్నారు. కాగా మెంతులు మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయట. రక్తంలో చక్కెరను కంట్రోల్ చేస్తాయని, సోంపు శరీరంలో గ్లూకోజ్ స్థాయిని సమతుల్యం చేస్తుందని, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే మెంతులు, సోంపు నీరు మహిళల్లో హార్మోనల్ బ్యాలెన్స్ నిలబెట్టుకోవడానికి హెల్ప్ చేస్తాయట.

‎ ఇది పీరియడ్స్ రెగ్యులర్ చేయడంలో హెల్ప్ చేసి నొప్పిని తగ్గిస్తాయని చెబుతున్నారు. అలాగే ఈ నీరు చర్మం, జుట్టు కోసం ఉపయోగకరంగా ఉంటుందట. ఈ నీటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉన్న టాక్సిన్లను తొలగిస్తాయట. ఇది చర్మానికి మెరుపును ఇస్తుందని, జుట్టుకు బలాన్ని అందిస్తుందని చెబుతున్నారు. ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ సోంపును రాత్రిపూట నీటిలో నానబెట్టాలి. ఉదయం ఈ నీటిని కొద్దిగా గోరువెచ్చగా చేసి వడకట్టాలి. తర్వాత పరగడుపున నెమ్మదిగా తాగాలి. సోంపు, మెంతులు రెండూ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంటాయట. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version