Fast food Damaging children health : పిల్లలకు ఫాస్ట్ ఫుడ్ తినిపిస్తున్నారా, అయితే వాళ్ల లివర్ ను గాయపరిచినట్లే…!!

కాలేయం శరీరంలో అతి ముఖ్యమైన అవయవం. ఆహారాన్ని జీర్ణం చేయడం, పోషకాలను శక్తిగా మార్చడం, శరీరం నుండి విషాన్నితొలగించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

  • Written By:
  • Publish Date - September 14, 2022 / 08:14 AM IST

కాలేయం శరీరంలో అతి ముఖ్యమైన అవయవం. ఆహారాన్ని జీర్ణం చేయడం, పోషకాలను శక్తిగా మార్చడం, శరీరం నుండి విషాన్నితొలగించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. వీటితోపాటు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలోనూ ముఖ్యభూమిక పోషిస్తుంది. నూనె పదార్థాలు ఎక్కువగా తినడం, వ్యాయామం లేకపోవడంతో, పెద్దవారిలో కాలేయ ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయి, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ క్యాన్డ్ ఫుడ్ ధోరణి కారణంగా పిల్లల్లోనూ కొవ్వు, కాలేయం, జీర్ణ సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. ఫ్యాటీ లివర్ సమస్యలో కాలేయంపై కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా కాలేయం దెబ్బతింటుంది. జీర్ణవ్యవస్థ బలహీనంగా మారడంతో అనేక వ్యాధులకు కారణం అవుతుంది.

పిల్లల్లో లివర్ ఇన్ఫెక్షన్లు:
పిల్లల్లో లివర్ ఇన్ఫెక్షన్ వారి శారీరక ఎదుగుదలతోపాటు జీర్ణవ్వవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఈ రోజుల్లో జంక్ ఫుడ్ పిల్లలకు జంక్ ఫుడ్ కు ఎక్కువగా అలవాటు పడ్డారు. ఇంట్లో తయారు చేసిన రుచికరమైన ఆహారం కంటేనూ… పిజ్జా, బర్గర్లు, నూడుల్స్, చిప్స్ మొదలైనవి తినడానికి ఇష్టపడతారు. వీటిలో చాలా వరకు మైదా నుండి తయారు చేస్తారు. వీటిలో నూనె, మసాలాలు అధికంగా ఉపయోగిస్తారు. సాధారణంగా కొంతమంది తల్లులు పిల్లల మధ్యాహ్న భోజనంగలో నూడుల్స్ , ఫ్రై బ్రెడ్ మొదలైన రిచ్, నూన్ పదార్థాలను పెడుతుంటారు. ఈ ఫుడ్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వేగంగా బరువు పెరగడానికి కారణం అవుతుంది. అంతేకాదు అధిక కొవ్వు కాలేయ అనారోగ్యానికి ప్రధాన కారణం అవుతుంది. కాలేయ వ్యాధికి సంబంధించిన ప్రారంభ లక్షణాలను గుర్తించనట్లయితే…అది హెపటైటిస్ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణం అవుతుంది. క్రమంగా కాలేయ వైఫల్యానికి దారి తీస్తుంది.

జంక్ ఫుడ్ పై పిల్లలకు అవగాహన:
పిల్లల ఆరోగ్యం తల్లుల చేతిలోనే ఉంటుంది. పోషకాహారం వల్ల కలిగే ప్రయోజనాల గురించి పిల్లలకు వివరించాలి. ఫాస్ట్ ఫుడ్ లేదా క్యాన్డ్ ఫుడ్ నుంచి పిల్లలను క్రమంగా దూరం చేస్తుండాలి. ఫాస్ట్ ఫుడ్ రుచికి పిల్లలు ఎక్కువగా అడిక్ట్ అవుతుంటారు. అందుకే పౌష్టికాహారం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యానికి ఏది మంచిది…ఏది చెడ్డది…ఈ తేడా తెలసుకోవాలి. పిల్లలు బయటకు వెళ్లిన ప్రతిసారి…ఏదోకటి తింటామంటూ మారం చేస్తుంటారు. ఈ సమయంలో బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ కానీ ఇతర బేకరి ఫుడ్స్ కానీ తింటుంటారు. అలాంటి సమయంలో ఆ ఫుడ్ వల్ల కలిగే అనారోగ్య సమస్యల గురించి వారికి అర్థమయ్యే రీతిలో చెప్పడం తల్లిదండ్రుల చేతిలో ఉంటుంది.

పిల్లలకు వ్యాయామం:
పిల్లలకు వ్యాయాయం, నడక అలవాటు చేయండి. శారీరకంగా చురుగ్గా ఉండేలా నేర్పించండి. ఆరోగ్యాంగా ఉండాలంటే వ్యాయాయం చాలా అవసరమనే..విషయాన్ని వారికి అర్థమయ్యేలా వివరించండి. ఉదయం లేదా సాయంత్రం వాకింగ్ కోసం మీతో తీసుకెళ్లండి. దీనివల్ల బరువులో అదుపులో ఉండి…యుక్త వయస్సు వచ్చేసరికి వ్యాయామానికి అలవాటు పడతారు. పిల్లలు కానీ పెద్దలు కానీ…కొన్నింటిని అంత తొందరగా మానడం కష్టంగా ఉంటుంది. కానీ పరిమిత మోతాదులో తీసుకోవడం లివర్ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవచ్చు. నూనె-మసాలా పదార్థాలు – నెయ్యి, వెన్న, క్రీమ్ ఉత్పత్తులు – కొవ్వు, అధిక కేలరీలు – క్యాన్డ్ ఫ్రూట్, జ్యూస్, స్వీట్లు, ఐస్ క్రీం వీటన్నింటికి పిల్లలను దూరంగా ఉంచడం మంచిది.