ప్రస్తుతం ప్రజలంతా మెడిసిన్ (Medicine ) తోనే బ్రతికేస్తున్నారు. చిన్న తలనొప్పి దగ్గరి నుండి పెద్ద నొప్పి వరకు అన్నింటికీ మెడిసిన్స్ వాడుతున్నారు. మెడిసిన్ అనేది ప్రజలకు ప్రధాన మార్గంగా మారింది. మెడిసిన్ లేకపోతే మనిషి మనుగడ లేదనేంతగా మారింది. దీంతో కేటుగాళ్లు నకిలీ మెడిసిన్స్ (Fake Medicine) తయారీ చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో ఈ నకిలీ మెడిసిన్ దందా మరింత విచ్చలవిడిగా మారింది.
పైకేమో బ్రాండెడ్ మెడిసిన్ (Branded Medicines) కంపెనీ పేరు ఉంటుంది..లోపల మాత్రం అంత నకిలీనే (Fake Medicine)..మెడికల్ షాప్స్ , మెడికల్ ఏజెన్సీ, RMP లు ఇలా అంత కూడా నకిలీ మెడిసిన్స్ ను వాడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ డ్రగ్ కంట్రోల్ బోర్డ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. నకిలీ మందుల తయారీపై ఉక్కుపాదం మోపుతోంది. వరుస దాడులతో కేటుగాళ్లకు చెక్ పెడుతున్నారు పోలీసులు. రాష్ట్రంలో నకిలీ డ్రగ్ తయారీ ముఠాలను అరెస్ట్ చేసినట్లు డ్రగ్ కంట్రోల్ బోర్డ్ (Drug Control Board) డీజీ కమలాసన్ రెడ్డి (DG Kamalasan Reddy) వెల్లడించారు. బ్రాండెడ్ పేరుతో నకిలీ మందులు తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ముఠా ఆగడాలకు కళ్లెం వేశామని చెప్పుకొచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
గత 6 నెలల నుంచి నకిలీ మందుల విక్రయాలపై నిఘా పెంచామని, నకిలీ డ్రగ్ తయారీ ముఠాలను అరెస్ట్ చేశామన్నారు. నకిలీ మెడిసిన్ అమ్మకాలు పై ఇంటర్ పోల్ సైతం ఆరా తీసిందన్నారు. ప్రముఖ కంపెనీల పేరుతో భారీగా నకిలీ మందులు తయారు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. మొక్కజొన్న పిండి, బంగాళదుంప, సుద్దతో నకిలీ మందులు తయారు చేసి బ్రాండెడ్ మెడిసిన్‌గా అమ్మకాలు జరుపుతున్నట్లు తమ తనిఖీల్లో తేలిందన్నారు. రాష్ట్రంలో 42 వేల మందులు షాప్ లు ఉన్నాయని, నకిలీ మందులను తక్కువ ధరలకే విక్రయిస్తున్నారని డీజీ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి కొరియర్ ద్వారా నకిలీ మందులు పంపిస్తున్నారని, అలాంటి ముఠాలపై స్పెషల్ ఫోకస్ పెట్టామని, డ్రగ్ కంట్రోల్‌కి వెబ్‌సైట్ ఉందని, టోల్ ఫ్రీ నంబర్‌తో పూర్తి సమాచారం అందులో పొందూ పరుస్తున్నామని తెలిపారు.
Read Also : BRS MLAS : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..కాంగ్రెస్ లో చేరతారా..?