Rs 355 Crores For Personal Security : వీవీఐపీలు తమ పర్సనల్ సెక్యూరిటీ కోసం సంవత్సరానికి కొన్ని కోట్లు ఖర్చు చేస్తుంటారు..
కానీ ఒక లెజెండరీ బిజినెస్ ఐకాన్ గత మూడేళ్లల్లో పర్సనల్ సెక్యూరిటీ కోసం దాదాపు రూ.355 కోట్లు ఖర్చు చేశారు.
అంటే ప్రతి సంవత్సరం ఆయన సగటున రూ.115 కోట్లు తన భద్రత కోసం నీళ్లలా వెచ్చించారు.
ఇంతకీ ఎవరాయన ?
ఆయన ఆస్తి నికర విలువ రూ.8 లక్షల కోట్లు.. ప్రపంచంలోని ధనికుల లిస్టులో ఆయన ర్యాంకు 9.. ఆయన కంపెనీ క్రియేట్ చేసిన ఒక మొబైల్ యాప్ ప్రతి ఒక్కరి ఫోన్ లో ఉంటుంది. ఆ యాప్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది స్నేహితులను కనెక్ట్ చేసి ఉంచుతుంది. ఇప్పటికే మీకు అర్ధమై ఉంటుంది.. మనం చెప్పుకోబోయేది ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ గురించి !!
గత మూడేళ్లలో మార్క్ జుకర్‌బర్గ్ తన వ్యక్తిగత భద్రత కోసం రూ.355 కోట్లు ఖర్చు చేశారని(Rs 355 Crores For Personal Security) పేర్కొంటూ అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ “న్యూయార్క్ పోస్ట్” ఈ కథనాన్ని పబ్లిష్ చేసింది. ఇక్కడి దాకా ఓకే .. కానీ ఆ కథనంలో ఓ వివాదాస్పద విషయాన్ని ప్రస్తావించారు. జుకర్‌బర్గ్ కుటుంబం “చాన్ జుకర్‌బర్గ్ ఇనీషియేటివ్”(CZI) అనే స్వచ్ఛంద సేవా సంస్థను నడుపుతోంది. ఇది విరాళాలు ఇస్తున్న సంస్థల జాబితాలో పాలసీ లింక్ (PolicyLink) కూడా ఉంది. ఇది ఢీఫండ్ పోలీస్ (DefundPolice.org) అనే సంస్థకు అనుబంధంగా పనిచేస్తుంది. 2020 నుంచి పాలసీ లింక్ సంస్థకు “చాన్ జుకర్‌బర్గ్ ఇనీషియేటివ్”(CZI) నుంచి రూ.24 కోట్ల డొనేషన్ ఇచ్చింది. అయితే “న్యూయార్క్ పోస్ట్” పబ్లిష్ చేసిన కథనంలో “DefundPolice.org” లక్ష్యాలు, కార్యక్రమాల గురించి ప్రస్తావించారు.
Also read : T Trains Coming Soon : స్టీమ్ ఇంజన్ కాని స్టీమ్ ఇంజన్ తో “టీ ట్రైన్స్”.. రాయల్ ఫీచర్స్ తో ఎంట్రీ
“అమెరికాలో పోలీసు శాఖకు నిధుల కేటాయింపును ఆపేసి.. సామాజిక సేవలు, యువజన సేవలు, గృహనిర్మాణం, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఇతర ప్రజా భద్రత కార్యక్రమాలపై పనిచేసే సంస్థలకు ఆ ఫండ్స్ ను కేటాయించాలని DefundPolice.org వాదిస్తుంది. అలాంటి సంస్థకు జుకర్‌బర్గ్ కుటుంబం విరాళాలు ఇస్తూనే.. ప్రతి సంవత్సరం వ్యక్తిగత భద్రతకు రూ.100 కోట్లు ఖర్చు చేయడం పోలీసు శాఖపై జుకర్ బర్గ్ కు ఉన్న అప నమ్మకానికి నిదర్శనం ” అని ఆ కథనంలో ప్రస్తావించారు. పోలీసు శాఖకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపే సాలిడాయిర్ (Solidaire) అనే మరో సంస్థకు కూడా జుకర్‌బర్గ్ కుటుంబం రూ.20 కోట్ల విరాళం ఇచ్చిందని న్యూస్ స్టోరీలో పేర్కొన్నారు.