Site icon HashtagU Telugu

Facial Razor Using Tips: అమ్మాయిలు ఫేస్ షేవింగ్ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే గాయాలు తప్పవు?

Mixcollage 16 Feb 2024 07 39 Pm 2588

Mixcollage 16 Feb 2024 07 39 Pm 2588

మామూలుగా అమ్మాయిలు అందం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ముఖం విషయంలో ఎన్నో జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. కనుబొమ్మలు అందంగా తీర్చిదిద్దుకుంటే ముఖం అందంగా కనిపిస్తుంది. అందుకే మగువలు థ్రెడింగ్ కోసం క్రమం తప్పకుండా పార్లర్‌కు వెళ్తుంటారు. పెదవులపై ఉన్న అవాంఛిత రోమాలను తొలగించేందుకు కొందరు థ్రెడింగ్ కూడా ఉపయోగిస్తారు. మరికొంతమంది వ్యాక్సింగ్ చేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల చాలా మందికి ముఖం దద్దుర్లు వస్తుంటాయి. అందుకే సాధ్యమైనంత వరకూ వ్యాక్సింగ్‌కు దూరంగా ఉంటారు.

ఎలాంటి నొప్పి లేకుండా రేజర్‌తో సులువుగా తొలగించుకోవచ్చు. అయితే కొందరు అమ్మాయిలకు హార్మోన్ల అసమతుల్యత వల్ల ముఖంపై వెంట్రుకలు అధికంగా వస్తాయి. అయితే ఈ అవాంఛిత రోమాలు ముఖ సౌందర్యానికి అడ్డంకిగా నిలుస్తాయి. అలాగే ముఖం కూడా అందవిహీనంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వాటిని తొలగించేందుకు వ్యాక్సింగ్, థ్రెడింగ్ సహాయం తీసుకోవాలి. కొందరు రేజర్లను కూడా ఉపయోగిస్తారు. ముఖంపై రేజర్ వాడితే చర్మంపై దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంది. అయితే కొంత జాగ్రత్తగా రేజర్‌ని ఉపయోగిస్తే సులువుగా పనైపోతుంది. అయితే ముఖంపై రేజర్ ని ఉపయోగించేటప్పుడు కొన్ని రకాల చిట్కాలు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. ముఖ వెంట్రుకలను తొలగించడానికి నాణ్యమైన రేజర్‌నే ఉపయోగించాలి. మార్కెట్లో అనేక రకాల ఫేషియల్ రేజర్లు అందుబాటులో ఉంటాయి. వాటిల్లో ఉత్తమమైన వాటిని మాత్రమే కొనుగోలు చేయాలి.

ముఖానికి రేజర్‌ను అవగాహన లేకుండా వినియోగిస్తే కోసుకుపోయే అవకాశం ఉంది. రేజర్ ఉపయోగించే ముందు ముఖాన్ని బాగా కడగాలి. మేకప్‌లోని దుమ్ము, ధూళిని ఫేస్ వాష్‌తో శుభ్రం చేసుకోవాలి. తర్వాత ముఖంపై ఫేస్ సీరమ్ లేదా మంచి నాణ్యత గల మాయిశ్చరైజర్‌ని అప్లై చేయాలి. ఇది రేజర్‌ను ఉపయోగించడం సులభతరం చేస్తుంది. కోసుకు పోయే అవకాశం కూడా తక్కువ. రేజర్‌ను అంచుకు వ్యతిరేక దిశలో కదిలించకూడదు. బదులుగా వెంట్రుకలు ఉన్న దిశలో రేజర్‌ను గీయాలి. రేజర్‌ను వినియోగించేటప్పుడు మరో చేత్తో చెంపను గట్టిగా అదిమిపట్టాలి. షేవింగ్ తర్వాత నీళ్లతో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత యాంటీ బ్యాక్టీరియల్ మాయిశ్చరైజర్‌ని అప్లై చేయాలి. అందుకు అలోవెరా జెల్ లేదా మంచి నాణ్యమైన మాయిశ్చరైజర్‌ని ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల ఎలాంటి దద్దుర్లు ఏర్పడవు.

Exit mobile version