Site icon HashtagU Telugu

Facial Exercise: ముఖంపై ముడతలు మాయం అవ్వాలంటే ఈ వ్యాయామాలు తప్పనిసరి.

Excersixe

Excersixe

వయసు పైబడే కొద్దీ ముఖంపై ముడతలు పడటం సాధారణ విషయమే. కానీ, ఈ రోజుల్లో 20, 30ల లోనే ముఖంపై ముడతలు వచ్చి చిన్న వయస్సులోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయి. ముఖంపై పోషకాల లోపంతో, ఒత్తిడి వల్ల, నిద్ర లేమి వల్ల, కంప్యూటర్ స్క్రీన్ కు దగ్గరగా కూర్చోవడం వల్ల, ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల, స్మోకింగ్, డ్రింకింగ్‌ కారణంగా ముఖంపై ముడతల సమస్య ఎక్కువైంది. ముడతలను తగ్గించడానికి ఫ్యేస్‌ ప్యాక్స్‌, కెమికల్‌ క్రీమ్స్‌ వాడుతూ ఉంటారు. రోజూ కొన్ని ఫేషియల్‌ ఎక్సర్‌సైజ్‌ ప్రాక్టిస్‌ చేస్తే ముఖంపై ముడతలు మాయం అయ్యి యంగ్‌గా ఉంటారు.

నుదుటి మీద ముడతలు దూరం అవ్వాలంటే:

తరచూ కళ్లు ఎగరేయడం, నదురు చిట్లించడం చేసేవారికి నుదుటి మీద ముడతలు ఉంటూ ఉంటాయి. కను బొమల నుంచి నుదిటి వరకూ ఉన్న చర్మాన్ని లాగి పట్టుకోవాలి. ఇలా కనీసం రోజూ పది సార్లు చేస్తుంటే అవి క్రమంగా తగ్గుతాయి.

మూతి చూట్టూ ముడతలు దూరం అవ్వాలంటే:

మూతి తిప్పడం వల్ల నోటి చుట్టూ ముడతలు కనిపిస్తూ ఉంటాయి. నోటిలో గాలి నింపి, పెదాలను బిగపట్టాలి. దీంతో బుగ్గలు ఉబ్బుతాయి. అప్పుడు పెదాలను చేత్తో కాసేపు నొక్కి ఉంచాలి. ఇలాచేస్తే నోటి చుట్టూ ముడతలు క్రమంగా తగ్గుతాయి.

మెడ భాగంలో ముడతలు దూరం అవ్వాలంటే:

మెడ భాగంలో ముడతలు పడినా చూడటానికి బాగుండదు. నిల్చుని, తలని కొంచెం వెనక్కి అనాలి. ఇప్పుడు మీ కళ్లని పై కప్పు వైపు తిప్పాలి. మీ పెదాలని కొంచెం పైకి లాగి పై కప్పుని చుంబించడానికి ప్రయత్నిస్తున్నట్ట్లుగా ఉండాలి. ఈ పోజీషన్‌లో 5 సెకండ్ల పాటు ఉండాలి. కనీసం 10 సార్లు ఈ వ్యాయామం చెయ్యాలి.

కళ్లకింద ముడతలు దూరం అవ్వాలంటే:

రెండు చేతుల చూపుడూ, మధ్య వేళ్లను ముందుగా కంటి కొలను దగ్గర పెట్టి చూపుడు వేలుని మాత్రం నెమ్మదిగా మర్దన చేస్తూ కొన దగ్గరకు తీసుకెళ్లాలి. ఈ సమయంలో మధ్య వేలితో చర్మాన్ని గట్టిగా పట్టి ఉంచాలి. ఇలా కనీసం రెండు నిమిషాలైనా చేయాలి. ఇలా రోజూ చేస్తే కళ్ల కింద ముడతలు దూరం అవుతాయి.