తలకు నూనె అప్లై చేయడం అన్నది కామన్ అయినప్పటికీ నూనె రాయడం అన్నది కూడా ఒక కళ అని చెబుతున్నారు. జుట్టుకు నూనె అప్లై చేసే ముందు కూడా తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు కొంతమంది నిపుణులు. ఎప్పుడైనా సరే తలకు నూనె రాసుకునే ముందు తప్పనిసరిగా గోరువెచ్చని నీటితో జుట్టును తడపాలట. ఇలా చేస్తే వెంట్రుకలు దృఢంగా మృదువుగా మారతాయని దీంతో పాటు హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది అని చెబుతున్నారు. డ్రై హెయిర్ కి నూనె రాయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అని చెబుతున్నారు.
జుట్టుకు కండిషనర్ అప్లై చేసిన సబ్బు రాసుకున్న షాంపూ పెట్టుకున్న తడిగా అయిపోతుందట. కానీ నూనె పెట్టుకుంటే మాత్రం డ్రైగా అయిపోతుందట. చాలా మంది పొడి జుట్టుకి నూనె రాస్తుంటారు. కాసేపు మసాజ్ చేసి తర్వాత తలస్నానం చేసేస్తారు. కానీ అలా చేయకూడదని అంటున్నారు. తడి జుట్టుపైనే నూనె రాసుకోవాలని సూచిస్తున్నారు. అంతే కాకుండా జుట్టుకి నూనె రాయాలనుకున్న వారు ముందుగా గోరువెచ్చని నీటితో జుట్టుని తడపాలట. మరీ చల్లని, వేడి నీటితో జుట్టుని తడి చేసుకోకూడదట. గోరు వెచ్చని నీటితో తడిపిన తర్వాత నూనె రాసుకోవాలట.
జుట్టుకు కొబ్బరి నూనె కంటే ఆవాల నూనె చాలా మంచిదని చెబుతున్నారు. గోరువెచ్చని నీటితో జుట్టుని తడి చేసుకున్న తర్వాత ఆవాల నూనె పట్టించాలని చెబుతున్నారు. నూనె పెట్టుకోవడం అయిపోయిన తర్వాత జుట్టు దువ్వుకోవాలిట. 5 నిమిషాలు ఆగి షాంపూతో శుభ్రం చేసుకోవాలట. రోజూ ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు. ఎప్పుడైనా జుట్టుకు నూనె అప్లై చేసేవారు జుట్టు మొదల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలని, స్మూత్ గా చేయాలని అలా కాకుండా ఎలా పడితే అలా నూనెని అప్లై చేయకూడదని చెబుతున్నారు. నూనె రాసుకున్న తర్వాత గాడిద ఎక్కువగా ఉన్న షాంపూలతో తల స్నానం చేస్తే హెయిర్ ఫాల్ అలాగే జుట్టుకు సంబంధించిన సమస్యలు వస్తాయని చెబుతున్నారు.