Fenugreek tea: చుండ్రు తగ్గి, జుట్టు పెరగాలంటే ప్రతిరోజు ఈ టీ తాగాల్సిందే?

మామూలుగా ప్రతి ఒక్కరి వంట గదిలో సుగంధ ద్రవ్యాలు ఉండడం ఉన్నది సహజం. ఈ సుగంధ ద్రవ్యాలు లేని ఇల్లు అంటూ ఉండదేమో. సుగంధ ద్రవ్యాలు అన

  • Written By:
  • Publish Date - September 15, 2023 / 09:50 PM IST

మామూలుగా ప్రతి ఒక్కరి వంట గదిలో సుగంధ ద్రవ్యాలు ఉండడం ఉన్నది సహజం. ఈ సుగంధ ద్రవ్యాలు లేని ఇల్లు అంటూ ఉండదేమో. సుగంధ ద్రవ్యాలు అనగానే లవంగం, దాల్చిన చెక్క,జీలకర్ర ధనియాలు,యాలకులు అంటూ ఇలా ఎన్నో వంటగదిలో ఉంటాయి. వీటిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. సుగంధ ద్రవ్యాలలోని పోషకాలు, ఔషధ గుణాలు సౌందర్య పోషణకు, కోశ సంరక్షణకూ సహాయపడతాయి. వీటిలో మెంతులు కూడా ఒకటి. మెంతులు జుట్టు సంరక్షణకు తోడ్పడతాయి.

మెంతులలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, కార్మినేటివ్‌ లక్షణాలు ఉంటాయి. రోజూ మెంతుల టీ తాగితే హెయిర్‌ ఫాల్‌ కంట్రోల్‌లో ఉండడంతో పాటు జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. మెంతులలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లతో పాటు, ఐరన్‌, ప్రోటీన్ ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఫంగల్‌ లక్షణాలు ఉంటాయి. మెంతులను ఎక్కువగా తీసుకునేవారికి ఆరు నెలల్లో జుట్టు పరిమాణం పెరుగుతుంది. వీరికి కాలక్రమేణా జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.​మెంతి గింజలు శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడే యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.

మరి మెంతుల టీ ఎలా తయారు చేయాలి అన్న విషయాన్ని వస్తే.. మీరు ఒక టీస్పూన్ మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఆ మిశ్రమాన్ని త్రాగవచ్చు. లేకపోతే ఒక టీస్పూన్ మెంతి గింజలను ఒక గ్లాస్‌ నీటిలో కొంతసేపు మరగబెట్టి ఆ తర్వాత వడపోసి ఆ టీ ను తాగితే సరి. ఈ టీని తరచుగా తాగుతూ ఉండడం వల్ల చుండ్రు సమస్య తగ్గడంతో పాటు, జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుంది. జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలు కూడా తొలగిపోతాయి