Eye Sight: ప్రస్తుత రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది కంటిచూపు సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. డిజిటల్ వాడకం వినియోగం పెరిగిపోయిన తర్వాత చిన్న పిల్లల నుంచే ఈ కంటి సమస్యలు మొదలవుతున్నాయి. చిన్న వయసు నుంచే కళ్ళజోడు ను ఉపయోగించాల్సిన పరిస్థితిలు వస్తున్నాయి. అలాగే స్క్రీన్ సమయం, కాలుష్యం, జీవనశైలి, ఒత్తిడి పెరగడం వల్ల కళ్లపై ఒత్తిడి పెరుగుతోంది. దీనివల్ల దృష్టిలోపం సమస్య చాలామందిలో పెరుగుతోంది. మరి ఇటువంటి సమస్యలు ఉండకూడదు అంటే ఇప్పుడు చెప్పినట్టు ఈ ఎనిమిది చిట్కాలను పాటించాల్సిందే అని చెబుతున్నారు.
అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణ కంటి సమస్యలను నివారించడానికి, మొత్తం దృష్టిని మెరుగుపరచడానికి లైఫ్‌స్టైల్ లో కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. రోజువారీ అలవాట్ల నుంచి పోషకాహారం, నివారణ, సంరక్షణ వరకు 8 చిట్కాలు ఫాలో అవ్వాలని చెబుతున్నారు. వీటివల్ల చూపు స్పష్టంగా మారడంతో పాటు సౌకర్యవంతంగా, ఆరోగ్యంగా ఉంటాయట. కాగా దృష్టి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి రెగ్యులర్‌గా కంటి పరీక్షలు చేయించుకోవాలట. వీటివల్ల గ్లకోమా, క్షీణత, డయాబెటిక్ రెటినోపతి వంటి అనేక కంటి సమస్యలను ముందుగానే గుర్తించవచ్చని, వీటిని పట్టించుకోకపోతే నెమ్మదిగా అభివృద్ధి చెందుతాయని చెబుతున్నారు.
కాబట్టి సంవత్సరానికి ఒకసారైనా కంటి వైద్యుడు లేదా ఆప్టోమెట్రిస్ట్ దగ్గరికి వెళ్లి చెకప్ చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. అతినీలలోహిత కిరణాలకు ఎక్కువ సేపు గురికావడం వల్ల కంటిశుక్లం, మచ్చల క్షీణత, ఇతర కంటి సమస్యలు వస్తాయట. కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు 100% UVA, UVB కిరణాలను నిరోధించే అధిక నాణ్యత గల సన్ గ్లాసెస్ ధరించడం మంచిదని, సన్ గ్లాసెస్ తో పాటు వెడల్పాటి అంచు కలిగిన టోపీలు కూడా పెట్టుకోవచ్చని,ఇవి మీరు స్టైలిష్ గా కనిపించేలా చేయడంతో పాటు కంటికీ రక్షణ ఇస్తాయని చెబుతున్నారు. అలాగే మీరు తీసుకునే ఆహారం కంటి ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుందట. కాబట్టి మీరు తీసుకునే డైట్ లో విటమిన్ ఎ, సి, ఇ, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, లుటిన్, జియాక్సంతిన్ వంటి పోషకాలు ఉండేలా చూసుకోవాలట. ఇవి కంటి వ్యాధులను నివారించడంలో, స్పష్టమైన దృష్టిని అందించడంలో హెల్ప్ అవుతాయట.
పాలకూర వంటి ఆకుకూరలు, క్యారెట్లు, బెల్ పెప్పర్స్ వంటి రంగురంగుల కూరగాయలు డైట్లో చేర్చు కోవాలని సూచిస్తున్నారు. కంప్యూటర్ స్క్రీన్లు, స్మార్ట్‌ఫోన్‌లు ఎక్కువసేపు చూడడం వల్ల కంటిపై ఒత్తిడి పెరుగుతుందట. దీనివల్ల దృష్టిలోపం, తలనొప్పి వస్తాయి. ఈ సమస్యని తగ్గించడానికి 20-20-20 నియమాన్ని ఫాలో అవ్వాలని చెబుతున్నారు నిపుణులు. ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరంలో ఉన్న ఏదైనా వస్తువును కనీసం 20 సెకన్ల పాటు చూడటం వలన ఒత్తిడి తగ్గుతుందట. అలాగే శారీరక వ్యాయామం శరీరాన్ని బలోపేతం చేసినట్లే కంటి వ్యాయామాలు దృష్టిని మెరుగుపరుస్తాయట. కంటిని సవ్యదిశలో, అపసవ్య దిశలో తిప్పాలి. దగ్గర, దూర వస్తువులపై దృష్టి పెట్టాలట. తరచుగా రెప్పలు వేయడం వంటి పద్ధతులు కూడా కంటి అలసటను తగ్గిస్తాయి. అరచేతులతో కళ్లను మూయడం కళ్లకు మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుందని చెబుతున్నారు.
Eye Sight: కంటి సమస్యతో ఇబ్బందిపడుతున్నారా.. దృష్టిలోపం రాకుండా ఉండాలంటే ఇవి పాటించాల్సిందే!

Eye Sight